ఆ అలవాటు ఉన్నవారికి జుట్టు త్వరగా తెల్లబడుతుంది?

by Prasanna |   ( Updated:2024-03-19 07:37:13.0  )
ఆ అలవాటు ఉన్నవారికి  జుట్టు త్వరగా తెల్లబడుతుంది?
X

దిశ, ఫీచర్స్ : ఈ మధ్యకాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల వెంట్రుకలు నెరవడం. ఇది సాధారణంగా వయసు పై బడిన వారిలో కనిపిస్తుంది. అయితే, ఇప్పుడు అందరూ కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పులే కారణమని నిపుణులు అంటున్నారు. ఇంతకీ తెల్ల జుట్టు రావడానికి అసలు కారణం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

జుట్టు నెరసిపోవడానికి అసలు కారణాలు ఇవే..

1. మీ తలకు నూనె రాసుకోకపోవడం కూడా నెరిసిపోవడానికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. వారానికోసారైనా నూనె తలకు పట్టించాలని చెబుతున్నారు. పోషకాల లోపం వల్ల పొడిబారుతుంది. జుట్టు నెరసిపోవడానికి ఇదే కారణమని కూడా చెబుతున్నారు.

2. ఒత్తిడి, ఆందోళన వల్ల కూడా జుట్టు తెల్లబడుతుందని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఒత్తిడి పెరిగేకొద్దీ, మీ జుట్టు కాలక్రమేణా తెలుపు రంగులోకి మారుతుందని అంటారు.

3. స్మోకింగ్ అలవాటు కూడా జుట్టు త్వరగా తెల్లబడడానికి కారణమని అభిప్రాయపడుతున్నారు. పొగాకు పొగలోని హానికరమైన రసాయనాలు జుట్టు కుదుళ్లను దెబ్బతీస్తాయి.

4. జుట్టు త్వరగా తెల్లబడడానికి నిద్రలేమి కూడా ఒక కారణం. నిద్ర సరిపోకపోతే.. జుట్టు తెల్లబడే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. నిద్ర లేకపోవడం జుట్టు ఆరోగ్యానికి సంబంధించిన వివిధ శారీరక విధులకు అంతరాయం కలిగిస్తుంది.


Read More..

వేసవిలో చెరుకు రసం తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా

Advertisement

Next Story

Most Viewed