- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Fear of failure: భయమే సక్సెస్‌కు అసలు అడ్డంకి.. ఈ లక్షణాలే నిదర్శనం!
దిశ, ఫీచర్స్ : భయమే మనిషికి పిరికితనం అన్నారు పెద్దలు. అది ఏరకమైన భయమైనా జీవితంలో మీ సక్సెస్‌కు ప్రధాన అడ్డంకిగా మారుతుందని నిపుణులు సైతం చెప్తుంటారు. కొన్నిసార్లు దాని ప్రభావం నేరుగా ఉంటే.. ఇంకొన్నిసార్లు పరోక్షంగా ఉంటుంది. ఒక్కసారి మనస్సులోకి చొరబడి స్థిరపడిపోతే మీకు తెలియకుండానే మీ సామర్థ్యాలను దెబ్బతీసే ప్రమాదకరమైన వ్యాధి లాంటిదే భయం. ఏదైనా ప్రయత్నించకముందే ‘విఫలం చెందుతామేమో’ అనే ఆలోచనలోంచి పుట్టుకొచ్చే కొన్ని భయాలు ఎలా ప్రభావితం చేస్తాయి, అవి కలిగి ఉన్న వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆచరణకు బదులు అతి విశ్లేషణ
ఒక అంశంపట్ల విశ్లేషణ వాస్తవానికి ఒక విలువైన సాధనం కావచ్చు. కానీ అన్ని సందర్భాల్లోనూ అలాగే పనిచేయదు. అత్యవసర పరిస్థితుల్లో, వ్యక్తిగత నిర్ణయాలలో, ప్రమాదాలను నివారించడానికి ఒక మార్గంగా ఉపయోగించినప్పుడు ఓవర్ ఎనాలిసిస్ అనేది మీ విజయానికి అడ్డంకిగా కూడా మారవచ్చు అంటున్నారు నిపుణులు. పైగా ఓవర్ ఎనాలిసిస్ మిమ్మల్ని అనిశ్చితిలో ఉంచడం ద్వారా ఏదైనా ఒక విషయంలో యాక్షన్ తీసుకునే కీలకమైన దశ నుంచి మిమ్మల్ని వెనక్కి నెడుతుంది. కాబట్టి వైఫల్యం ఎదురైనప్పటికీ సరైన మార్గం కనుగొనడానికి, మిమ్మల్ని మీరు మెరుగు పర్చుకోవడానికి ఆ అనుభవం ఉపయోగపడుతుందనే ఆలోచనతో ముందు సాగాలంటన్నారు నిపుణులు.
కొత్త అనుభవాలను నివారించడం
తెలియని విషయాల గురించి ఆలోచించడం, తెలియని పనులు చేయడం ఎవరికైనా కొంత భయంగానే అనిపిస్తుంది. అలాగని విఫలం చెందుతామని, తప్పులు దొర్లుతాయనే ఆలోచనతో మీరు కంఫర్ట్ జోన్‌లోనే ఉండటానికే ఇష్టపడితే జీవితంలో ఎదగడం కష్టం కావచ్చు. ‘ఎప్పుడూ తప్పు చేయని వ్యక్తి కొత్తగా ఏదీ ప్రయత్నించలేడు’ అని ఐన్‌స్టీన్ అన్నట్లుగా.. ఇక్కడ తప్పు లేదా వైఫల్యం గురించిన ముందస్తు ఆలోచనే మీ ఎదుగుదలను, సామర్థ్యాన్ని పరిమితం చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. పైగా కొత్త అనుభవాలను నివారించడం ద్వారా నేర్చుకునే మార్గాలను, ఎదిగే అవకాశాలను కోల్పోతారు.
సామాజిక కట్టుబాట్లు
కొన్నిసార్లు సామాజిక కట్టుబాట్లు, నమ్మకాలు, ప్రవర్తనలు కూడా మీరు కొన్ని విషయాలపట్ల ప్రయత్నాలు మానుకునేలా చేస్తుండవచ్చు. ముఖ్యంగా షరతులతో కూడిన రియాక్షన్స్ కూడా వైఫల్యానికి భయపడేలా చేస్తాయి. మీలోని క్రియేటివిటీని, వ్యక్తిగత అభివృద్ధిని అడ్డుకుంటాయి. కాబట్టి మీ చుట్టూ ఉండే సంప్రదాయాలు, సామాజిక కట్టుబాట్లు, నమ్మకాలు, అపోహలు నిజానికి మంచివేనా అని ఆలోచించగలిగితే వాటివల్ల ఏర్పడే భయాలు మిమ్మల్ని వీడే అవకాశం ఉంటుంది. దీంతో స్వీయ పరిమితులను అధిగమించడం ద్వారా సోషల్ కండిషనింగ్ మిమ్మల్ని ట్రాప్ చేయకుండా అడ్డుకోవచ్చు.
భావాలు వ్యక్తీకరించకపోవడం
వైఫల్యం చెందుతామన్న భయంతో మీ నిజమైన స్వభావాన్ని వ్యక్తీకరించలేకపోతారు. పైగా ఇతరుల లేదా పరిస్థితులకు అనుగుణంగా ఉంటారు. ఎవరైనా జడ్జ్ చేస్తారని, సమాజం ఏమనుకుంటుందోనని భావిస్తూ ప్రయత్నించకపోవడమే సులభమైన మార్గంగా భావిస్తారు. కానీ ఇలాంటి ప్రవర్తన కూడా మీ క్రియేటివిటీని దెబ్బతీస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే మీరు విభిన్న ఆలోచనలను పరిమితం చేస్తారు. సమస్య పరిష్కారానికి, ప్రత్యేక ఆలోచనలను వ్యక్తీ కరించడానికి ఇది ఆటంకంగా మారుతుంది.
ఎదుగుదలకంటే కంఫర్ట్ ముఖ్యం
కొందరు ఫెయిల్యూర్‌కు భయపడి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రారు. ఎదుగుదలకంటే సౌకర్యమే మంచిదని భావిస్తుంటారు. కానీ తర్వాత నష్టోతారని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే నిరంతరం సౌకర్యాన్ని కోరుకోవడంవల్ల అనేక విషయాల్లో రిస్క్ తీసుకోవడం ఆపివేస్తారు. దీంతో వ్యక్తిగత అభివృద్ధికి విలువైన అవకాశాలను కోల్పోతారు. ఇది సమాజం మనకు తరచుగా చెప్పేదానికి విరుద్ధంగా అనిపిస్తుండవచ్చు కానీ అసౌకర్యాన్ని ఎదుర్కోవడం ద్వారా క్రియేటివిటీ సామర్థ్యాన్ని పొందడమే మీ నిజమైన సామర్థ్యానికి నిదర్శనంగా నిపుణులు పేర్కొంటున్నారు. అసౌకర్యాన్ని అనుభవిస్తేనే సౌకర్యం విలువ తెలుస్తుందని చెప్తున్నారు.
జడ్జ్ స్తారనే భయం
ఎవరో తమను జడ్జ్ చేస్తారనే భయం నిజానికి మీ నిజమైన స్వభావాన్ని వ్యక్త పరచకుండా నిరోధిస్తుంది. దీంతో మీ కలలు, గుర్తింపు, సామాజిక అంచనాలను అందుకోవడంలో అడ్డంకిగా మారుతుంది. ప్రామాణికమైన స్వీయ వ్యక్తీకరణను అణచివేస్తుంది. కాబట్టి ఇక్కడ స్వీయ అవగాహన అసవరం. కాబట్టి బాహ్య అంచనాలకు అనుగుణంగా ఉండటంకంటే మీ కలలను నిజం చేసుకోవడం ఇక్కడ ముఖ్యమని గమనించండి. ఎవరో ఏదో అంటారని, అనుకుంటారనే భయాన్ని వీడినప్పుడే క్రియేటివిటీ, ప్రామాణికత అలవడుతాయి. విలువలు, అభిరుచులకు అనుగుణంగా జీవించడం ప్రారంభిస్తారు.
పరిపూర్ణతపైనే ఫోకస్
పర్‌ఫెక్షనిజం ఒక గొప్ప అన్వేషణ లాగా అనిపించవచ్చు. కానీ ఇది భయానికి మరో రూపం కూడాను అంటున్నారు నిపుణులు. కాబట్టి పరిపూర్ణతకోసం ప్రయత్నించేవారు కొన్ని విషయాల్లో విఫలం అవుతామనే భయంతో వ్యక్తిగత ఎదుగుదల విషయంలో సరైన నిర్ణయాలు, కార్యాచరణ తీసుకోకుండా ఉండిపోతుంటారు. కానీ ఇది కరెక్ట్ కాదని మానసిక నిపుణులు అంటున్నారు. ఇక్కడ పరిపూర్ణతకంటే పురోగతి చాలా ముఖ్యమని చెబుతున్నారు. కాబట్టి మీ ఫోకస్ అంతా పర్‌ఫెక్షనిజంపై కాకుండా ప్రోగ్రెసివ్ వైపు మళ్లించినట్లయితే నేర్చుకోవడం, ఎదగడం వంటివి చేస్తారు. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి, విజయానికి ఇది చాలా ముఖ్యం.
స్వీయ సంరక్షణపై నిర్లక్ష్యం
స్వీయ సంరక్షణ భావాన్ని, ప్రవర్తనను కొందరు సెల్ఫి్స్ట్ లేదా స్వార్థపూరితమైనదిగా భావిస్తుంటారు. కానీ నిస్వార్థాన్ని, పరోపకారాన్ని నొక్కి చెప్పే సమాజంలో సెల్ఫ్ కేర్ కూడా ముఖ్యమని గుర్తుంచుకోండి. పైగా ఇది మీ మొత్తం శ్రేయస్సును మేనేజ్ చేయడానికి కీలకం. కాబట్టి ఇతరుల అవసరాలను నెరవేర్చడంలో మునిగిపోయి మీ అవసరాలను నిర్లక్ష్యం చేయడం, విఫలం చెందుతామని ప్రయత్నించకపోవడం తగదు. స్వీయ సంరక్షణకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే అది మీ ఆత్మగౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. వైఫల్యాన్ని స్వీకరించి ప్రయత్నానికి ప్రేరణగా నిలుస్తుంది. కాబట్టి మీ ఎదుగులకు మరో మెట్టు స్వీయ సంరక్షణ.