- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Cancer : ఫాస్టింగ్‌తో క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా..? అధ్యయనంలో తేలిందేమిటంటే..
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో క్యాన్సర్ కూడా ఒకటి. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు ఈ రిస్క్‌ను మరింత పెంచుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. దాని నివారణ, రిస్క్ ఫ్యాక్టర్స్‌పై నింరతర పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో కొత్త విషయాన్ని ముందుకు తెచ్చారు మెమోరియల్ స్లోన్ కెట్టరింగ్ క్యాన్సర్ సెంటర్‌కు చెందిన రీసెర్చర్స్. ఏంటంటే.. ఉపవాసం కూడా క్యాన్సర్ నివారణలో తనవంతు పాత్ర పోషిస్తుందని చెప్తున్నారు.
ఫాస్టింగ్ అంటే ఆకలి వేసినా తినకుండా ఉండే ప్రక్రియ. అలాంటప్పుడు ఇది క్యాన్సర్‌ను ఎలా తగ్గిస్తుందనే అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తు్న్నారు. కానీ పరిశోధకులు మాత్రం ఉపవాసం అనేది శరీరంలోని నేచురల్ రక్షణ వ్యవస్థను బలంగా మార్చడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుతుందని, అది క్యాన్సర్ కణాల మీద దాడిచేయడం ద్వారా రిస్కును తగ్గిస్తుందని చెప్తున్నారు.
అంతేకాకుండా క్యాన్సర్ చికిత్సలో భాగంగా కీమో థెరపీ మెడికేషన్స్ వల్ల పలువురిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. అయితే ఇలాంటప్పుడు ఉపవాసం తాత్కాలిక ఉపశమనాన్ని కలిగిస్తుందని, షార్ట్ టైమ్ ఫాస్టింగ్ హెల్తీ బ్లడ్ సెల్స్‌ను రక్షించడం ద్వారా ఇది సాధ్యం అవుతుందని చెప్తున్నారు. 2012లో ఎలుకలపై చేసిన ప్రయోగంలో వెల్లడైనట్లు రీసెర్చర్స్ పేర్కొంటున్నారు.
ఉపవాసం ఎక్కువ రోజులు చేస్తే ప్రతికూల ప్రభావం చూపవచ్చు. కానీ అప్పుడప్పుడూ ఉండే ఉపవాసాలవల్ల మాత్రం మేలు జరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. జర్మన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ పరిశోధకుల అధ్యయనం కూడా ఇదే చెప్తోంది. వరుసగా ఐదు రోజులపాటు ఒక క్రమ పద్ధతిలో తింటూ.. ఆ తర్వాత రెండు రెండు రోజులపాటు ద్రప దార్థాలు లేదా తేలికగా పండ్లు లేదా డాక్టర్లు సూచించిన పదార్థాలను తినడంవల్ల ఫ్యాటీ లివర్ , కాలేయ క్యాన్సర్ వంటి అనారోగ్యాలతో సంభవించే ముప్పు తగ్గుతుందని పరిశోధకులు అంటున్నారు.
అంతేకాకుండా ఉపవాసం క్యాన్సర్ సెల్స్‌తో పోరాడగలిగే రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపించడం ద్వారా ఇన్సులిన్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. ఫలితంగా క్యాన్సర్ కణాల వృద్ధి మందగిస్తుందని, డెత్ క్యాన్సర్ సెల్స్ కూడా శరీరం నుంచి తొలగిపోతాయని రీసెర్చర్స్ పేర్కొంటున్నారు. అయితే ఉపవాసాలు చేయాలా? వద్దా అనేది ఆయా వ్యక్తుల వ్యక్తిగత ఆసక్తి, శారీరక లక్షణాలను బట్టి కూడా నిర్ధారించాల్సి ఉంటుంది. ఈ విషయంలో డాక్టర్ల సలహా తప్పనిసరి అని పరిశోధకులు అంటున్నారు. అదీగాక ఈ ఫాస్టింగ్ బేసిస్ స్టడీస్ అన్నీ క్యాన్సర్ నివారణలపై క్యూరియాసిటీని పెంచుతున్నప్పటికీ, ఇవన్నీ ఎలుకలపై జరిగిన పరిశోధనలే. మనుషుల విషయంలో ఎలాంటి ప్రభావం ఉంటుందనేందుకు అబ్జర్వేషన్స్ ఉన్నాయి. కానీ ఇంకా నిర్ధారించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు అంటున్నారు.
* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. దీనిని ‘దిశ’ ధృవీకరించడం లేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.