Fasting Rules: ఆయుర్వేదం ప్రకారం ఫాస్టింగ్ ఉండాల్సిన పద్ధతి.. ఈ పొరపాట్లు చేయొద్దంటోన్న ఆయుర్వేద నిపుణులు

by Anjali |   ( Updated:2024-08-03 14:24:10.0  )
Fasting Rules: ఆయుర్వేదం ప్రకారం ఫాస్టింగ్ ఉండాల్సిన పద్ధతి.. ఈ పొరపాట్లు చేయొద్దంటోన్న ఆయుర్వేద నిపుణులు
X

దిశ, ఫీచర్స్: తెలుగు ప్రజలు పండగలు జరుపుకోవడంలో, ఆచార సంప్రదాయాలను పాటించడంలో ముందు స్థానంలో ఉంటారు. అంతేకాకుండా ప్రత్యేక పండుగలు జరుపుకొనేటప్పుడు రోజంగా ఏం తినకుండా ఉపవాస దీక్షను చేపడతారు.ఎలాంటి ఆహారాలు తీసుకోకుండా నిష్ఠగా ఫాస్టింగ్ ఉంటారు.అయితే ఆయుర్వేదం ప్రకారం ఉపవాసం ఇలాంటి పొరపాట్లు చేయొద్దని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఉపవాసం ఉన్నప్పుడు సూర్యాస్తమయం అనంతరం వండని ఆహార పదార్థాలను తినవద్దు. అవి తొందరగా డైజేషన్ అవ్వవు. వండని కూరగాయలు, పండ్, సలాడ్లుల వంటి ఆహారాలు జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాగా ఫాస్టింగ్ విడిచాక ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటే పొట్ట ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఉపవాసంలో ఉన్నప్పుడు మిల్క్ షేక్స్ అస్సలు తీసుకోవద్దు. దీనిలో ఉండే అధిక ప్రోటీన్ తొందరగా జీర్ణం అవ్వదు.

అలాగే వేయించిన ఆహారాలు తీసుకోవద్దు. ఉదాహరణకు పూరీ, చిప్స్ వంటివి. వీటిలో కొవ్వు అధికంగా ఉంటుంది. ఏమి తినకుండా డైరెక్ట్ అవి తీసుకున్నట్లైతే హార్ట్ ప్రాబ్లమ్స్, బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఫాస్టింగ్ సమయంలో చక్కెర ఉన్న పదార్థాలు కూడా తీసుకోవద్దంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

Advertisement

Next Story

Most Viewed