- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పాత చీరలతో అదిరిపోయే ఫ్యాషన్ డ్రెసెస్.. మీరు ట్రై చేయండి
దిశ, ఫీచర్స్ : మహిళలకు చీరలంటే చాలా ఇష్టం. ఆడవారు మార్కెట్‌లోకి ఏ కొత్తరకం సారీస్, డ్రెసెస్ వచ్చినా సరే కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు ఇప్పుడు కొత్త కొత్త రకాల లంగావోణీలు,కుర్తీస్, లెహంగాలు డిజైనింగ్ చేయించుకుంటున్నారు. దీని కోసం వీరు స్పెషల్‌గా క్లాత్ తీసుకుంటారు. అయితే అలా అవసరం లేకుండా మన ఇంట్లో ఉన్న పాత చీరలతో అదిరిపోయే ఫ్యాషన్ డ్రెసెస్ డిజైన్ చేసుకొవచ్చునంట. అది ఎలానో తెలుసుకుందాం..
అమ్మాయిలకు పట్టు చీరలు, పరికిణీల ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అవి వారి అందాన్ని రెట్టింపు చేస్తాయి. అయితే మన ఇంట్లో ఉండే పాత బనారస్,కాంచీ పట్టు లాంటి చీరలతో అందమైన పట్టు పరికిణీలను, స్టైలిష్ డిజైన్‌తో స్టింగ్ చేయించుకుంటే అవి చాలా బాగుంటాయి. అంతే కాకుండా అవి కాస్లీ లుక్‌లో కనిపిస్తాయి. అవే కాకుండా పాత చీరలతో అనార్కలి డ్రెస్, సల్వార్, స్ట్రెయిట్ కుర్తా కుట్టించుకోవచ్చు. అలాగే కాంచీపురం, సిల్క్ లేదా బనారస్ చీరతో కుట్టించుకున్న డ్రెస్సులు ఏ సందర్భంలో అయినా వేసుకోవచ్చు.
ఇక మీ దగ్గర చందేరీ సిల్క్ లేదా బ్రోకేడ్ చీర ఉంటే దానితో ఫ్లేర్డ్ స్కర్ట్‌ని స్టైల్‌గా కుట్టించుకోవచ్చు. ఇది మీకు ఇండో-వెస్ట్రన్ లుక్ ఇస్తుంది. మీరు ఫార్మల్ షర్ట్ లేదా సాధారణ టాప్‌గా కుట్టించుకోవచ్చు. అదే విధంగా,పాత చీరలతో జీన్స్ లేదా, లెగ్గిన్స్‌తో వేసుకోవడానికి ట్యూనిక్ లేదా టాప్ చాలా ఈజీగా కుట్టించుకోవచ్చు. అలాగే మన ఇంట్లో ఉండే కాటన్ పాత సారీస్‌తో చిన్న పిల్లలకు గౌన్స్ కుట్టించవచ్చు.