టీవీ చూస్తూ నిద్రపోతున్నారా? ప్రమాదంలో పడ్డట్లే..!

by Anjali |
టీవీ చూస్తూ నిద్రపోతున్నారా? ప్రమాదంలో పడ్డట్లే..!
X

దిశ, ఫీచర్స్: ఈ మధ్యకాలంలో టీవీ చూసే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీనికి కారణం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు, బుల్లితెర ఎంటర్‌‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్. అయితే కొంతమంది అర్ధరాత్రి వరకు టీవీ చూసే అలవాటు ఉంటుంది. మరికొంతమంది తొందరగానే నిద్రిస్తారు. కాగా చాలా మందికి టీవీ చూస్తూ నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఇలా టీవీ చూస్తూ నిద్రించేవారు భవిష్యత్తులో అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తాజా పరిశోధనలో తేలింది.

టీవీ నుంచి వచ్చే తక్కువ వెలుతురులో నిద్రిస్తున్న వ్యక్తుల ఇన్సులిన్ లెవెల్స్ తగ్గుతాయి. ఫలితంగా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. దీంతో అధిక రక్తపోటు, మధుమేహం బారిన పడాల్సి వస్తుంది. అలాగే గుండె హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. మీరు ఎక్కువ సమయం స్క్రీన్‌పై గడిపినా అది మెదడుపై తీవ్రమైన చెడు ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. శారీరక ఆరోగ్యం మెల్లమెల్లగా క్షీణిస్తుంది. ఫలితంగా శరీరం బలహీనంగా మారుతుంది.

తాజా పరిశోధనలో వెల్లడైన విషయాలు గమనించిన యువత ఆందోళనకు గురవుతోంది. ఎందుకంటే చాలా మంది యూవతనే అర్ధరాత్రి వరకు మెలకువగా ఉండి ఎక్కువ సమయం పాటు టీవీ చూస్తున్నారు. ఎప్పుడు పడుకుంటున్నారో ఎప్పుడు నిద్రలేస్తున్నారో కూడా తెలియడం లేదు. దీని కారణంగా కండరాల నొప్పుల సమస్యలు తలెత్తుతాయి. కాగా అవసరాన్ని బట్టి ఫోన్ అండ్ టీవీ చూడండి. సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోండి. పుస్తకాలు బాగా చదవండి. ఎందుకంటే.. ఈ అలవాటు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే రోజూ మొత్తంలో అధికంగా నీరు తీసుకోండి. ఇవి అలవాటు చేసుకుంటే పూర్తి ఆరోగ్యంగా ఉంటారు.

Advertisement

Next Story

Most Viewed