- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Health: వేగంగా బరువు తగ్గుతున్నారా.. ?అనుమానించాల్సిందే!

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం అత్యధిక మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. దీనివల్ల అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు వంటి వ్యాధుల రిస్క్ పెరుగుతుంది. అందుకే వెయిట్‌లాస్ కోసం రకరకాల వ్యాయామాలు, ఆహార నియమాలు పాటిస్తుంటారు చాలా మంది. అయితే కొందరు ఎలాంటి ప్రయత్నం చేయకుండానే ఫాస్ట్‌గా బరువు తగ్గుతుంటారు. కానీ ఇలా జరిగితే తాము స్లిమ్‌గా తయారవుతున్నామని భావించడానికి లేదు. వేగంగా బరువు తగ్గడమనేది కూడా అనారోగ్య సూచికమని, పలు వ్యాధుల కారణంగా అలా జరగవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అవేమిటో చూద్దాం.
సాధారణంగా ఫిజికల్ యాక్టివిటీస్ లేదా వ్యాయామాలు లేకపోయినా బరువు తగ్గడానికిగల కారణాల్లో థైరాయిడ్ ఒకటి. శరీరంలో ఇది ఎక్కువ ప్రభావం చూపినప్పుడు అనుకోకుండా వెయిట్‌లాస్ అవడం స్టార్ట్ అవుతుంది. కాగా ఇందులో కూడా హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అని రెండు రకాలుగా ఉంటాయి. హైపర్ థైరాయిడిజం కారణంగా సంబంధిత థైరాయిడ్ గ్రంథి ఓవర్ యాక్టివేట్‌గా ఉంటుంది. దీనివల్ల బాధిత వ్యక్తులు ఫాస్ట్‌గా బరువు తగ్గే చాన్స్ ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇక డయాబెటిస్ వల్ల కూడా అకస్మాత్తుగా బరువు తగ్గుతుంటారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఇటీవల టీబీ, డిప్రెషన్, క్యాన్సర్ వంటి సమస్యలు చాలామందిని వెంటాడుతున్నాయి. ఫలితంగా నిద్ర, ఆహార నియమాలు సక్రమంగా ఉండటం లేదు. శరీరంలోని అవయవాల పని తీరు మందగించేలా డిప్రెషన్ ప్రభావం చూపుతుంది. ఇక టీబీ లేదా క్షయ వ్యాధి లంగ్స్‌పై ప్రతికూల ప్రభావం చూపడంవల్ల ఫాస్టుగా వెయిట్‌లాస్ అవుతారు. క్యాన్సర్ బాధితుల్లోనూ రోగనిరోధక శక్తి బలహీన పడటం కారణంగా వేగంగా బరువు తగ్గుతారు. పలు వ్యాధులతో ముడిపడి ఉన్నందున ఎటువంటి ప్రయత్నం లేకుండానే అధిక బరువు ఉన్నవారు వేగంగా బరువు తగ్గవచ్చు. అలాంటప్పుడు ఎంతకైనా మంచిది మీ శరీరంలో ఏదో జరుగుతుందని అనుమానించాలని, వెంటనే వైద్యులను సంప్రదించి తగిన సలహాలు, చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
*నోట్: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.