Dandruff : వేసవిలో చుండ్రు సమస్య ఎందుకు వస్తుంది?.. ఎలా నివారించాలి?

by Javid Pasha |
Dandruff : వేసవిలో చుండ్రు సమస్య ఎందుకు వస్తుంది?.. ఎలా నివారించాలి?
X

దిశ, ఫీచర్స్ : కొన్ని సమస్యలు చూడ్డానికి, వినడానికి అంత పెద్ద విశేషం ఏముంది.. చిన్న ప్రాబ్లమే కదా అనిపిస్తుంటాయి. కానీ వాటిని భరించే వారికి అవి ఓ ప్రపంచ యుద్ధం చేసినంత ఇబ్బందిగా తోస్తుంటాయి. తలలో చుండ్రు లేదా డాండ్రాఫ్ సమస్య కూడా దాదాపు అలాంటిదే. ప్రస్తుతం చాలామంది యువతీ యువకులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దువ్వెన పట్టుకొని తల దువ్వుకోవాల్సి వచ్చిన ప్రతిసారీ పలువురు నిరాశకు గురవుతుంటారు. అయితే ఈ సమస్య ఎందుకు వస్తుంది?.. ఎలా నివారించాలో తెలుసుకుందాం.

బయట ఎక్కువగా తిరిగే వారికి, తరచూ దుమ్మూ ధూళికి గురయ్యేవారికి తలలో చుండ్రు సమస్య వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే వాతావరణ కాలుష్యం, చర్మ సమస్యలు, ఎండలో ఎక్కువగా తిరగడం, చెమటలు రావడం, దురద వంటివి కూడా ఇందుకు కారణం అవుతుంటాయి. దీంతో పలువురు ఈ ప్రాబ్లం నుంచి బయట పడేందుకు రకరకాల షాంపూలు వాడుతుంటారు. అయినా ఫలితం ఉండకపోవచ్చు. షాంపూల్లో కెమికల్స్ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి కొందరికి ఇవి పడక కూడా డాండ్రాఫ్ ప్రాబ్లం రావచ్చు.

బయటకు వెళ్లినప్పుడు హెయిర్ మాస్క్ యూజ్ చేయడం, టూ వీలర్‌పై తిరిగే వారైతే హెల్మెట్ ధరించడం వల్ల ఈ సమస్యను నివారించుకోవచ్చు. అలాగే తలస్నానం చేసినప్పుడు సబ్బు కానీ, షాంపూ కానీ ఒకటి, రెండుకంటే ఎక్కువసార్లు పెట్టుకోవద్దు. చాలామంది స్నానం తర్వాత జుట్టు ఆరపెట్టడానికి హెయిర్ డ్రయ్యర్ వాడతుంటారు. చుండ్రు సమస్య ఉన్నవారు వాడకపోతే బెటర్. అలాగే ఈ మధ్య దాదాపు అందరూ వైట్ హెయిర్ కవర్ చేయడానికి కలర్ వేస్తున్నారు. ఆ కలర్ మీ శరీరానికి పడకపోయినా చుండ్రు సమస్య వస్తుంది. కాబట్టి బ్రాండ్ మార్చి చూడవచ్చు.

అలాగే అప్పుడప్పుడూ లేదా వీక్లీవన్స్ తలకు ఆయిల్ మసాజ్ చేయడం వల్ల డాండ్రఫ్ తగ్గుతుందట. ముందుగా మసాజ్ చేసి, ఆ తర్వాత షాంపూ లేదా సబ్బుతో కడిగి జుట్టును ఆరబెట్టాలి. ఇలా చేస్తూ ఉంటే చండ్రు సమస్య క్రమంగా తగ్గుతుంది. ఇటువంటి నివారణా చర్యల తర్వాత కూడా డాండ్రాఫ్ ప్రాబ్లం తగ్గకపోతే చర్మవైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం

*నోట్: వై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాల విషయంలో ‘దిశ’ ఎటువంటి బాధ్యతా వహించదు.

Advertisement

Next Story

Most Viewed