- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Trending : స్కిన్నీ జీన్స్ అంటే తెగ ఇష్టపడుతున్న యూత్.. కానీ..!

దిశ, ఫీచర్స్ : జీన్స్ ధరించడం లేటెస్ట్ ఫ్యాషన్.. అందులోనూ స్కిన్నీ(బిగుతైన)జీన్స్ అయితే మరీ ట్రెండీ అని ఫీలవుతుంటారు కొందరు యువతీ యువకులు. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం వేసుకునే దుస్తుల్లోనూ చాలా మార్పులు వచ్చాయి. కొన్నేండ్ల కిందట ఏవైతే ఫ్యాషన్(Fashion) అనుకున్నామో.. అలాంటి వాటిలో కొన్ని ఇప్పుడు ఔట్ డేటెడ్ కాగా, మరికొన్ని సరికొత్త రూపంలో అలరిస్తున్నాయి. అలాంటి వాటిలో జీన్స్ క్లాతింగ్స్ ఒకటి. నిజానికి మార్కెట్లోకి జీన్స్ రాక ఇప్పుడు కొత్త విషయం కాకపోయినా వాటిని ధరించడం మాత్రం ఎప్పుడూ కొత్తగానే ఫీలవుతోంది ఈతరం.. ముఖ్యంగా స్కిన్నీ జీన్స్ అంటే టీనేజ్ అమ్మాయిలు, అబ్బాయిలు తెగ ఇష్టపడుతంటారు.
డిజైన్ ఏదైనా.. క్లాతింగ్ మరేదైనా.. వేసుకునే దుస్తులు వ్యక్తుల వ్యక్తిత్వాన్నీ, అందాన్నీ, అప్పటి పరిస్థితుల పోకడలనూ సూచిస్తాయంటున్నారు నిపుణులు. అందుకే అందరితోపాటు అప్‌డేటెడ్‌గా కనిపించాలనే ఆరాటాన్ని తప్పుపట్టలేం. కానీ ఇక్కడ ఆరోగ్యం, సౌకర్యం, హుందాతనం వంటివి కూడా దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు నిపుణులు. ఆధునిక ఫ్యాషన్ పోకడలను అనుసరించకూడదని కాదు కానీ.. గుడ్డిగా ఫాలో అవడం కూడా నష్టమే. స్కిన్నీ జీన్స్ (Skinny jeans) కూడా అలాంటి కోవకే చెందుతాయంటున్నారు నిపుణులు. ఇవి బిగుతుగా ఉండటంవల్ల మీ బాడీ ఇమేజింగ్‌పై, హెల్త్‌పై నెగెటివ్ ఇంపాక్ట్ చూపే చాన్స్ ఉందంటున్నారు నిపుణులు.
స్కిన్నీ జీన్స్ స్టైలిష్(Stylish)గా, ట్రెండీ(Trendy)గా అనిపించినప్పటికీ, చాలా టైట్‌గా ఉండటంవల్ల శరీరంలో రక్త ప్రవాహానికి కొంత ఆటకం కలుగుతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా వేసవిలో చికాకు కలిగిస్తాయి. బిగుతుగా ఉండటంవల్ల చర్మానికి గాలి తగలదు. పైగా అధికగ చెమటలు ఏర్పడి, అవి బయటకు పోకుండా చర్మంపైనే ఉండటంవల్ల అలర్జీలు(Allergies), ఇన్ఫెక్షన్లు తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అంతేకాకుండా యువకులు స్కిన్నీ లేదా టైట్ జీన్స్ ధరించడంవల్ల వృషణాలు, నరాలపై ఒత్తిడి(pressure on nerves) పెరిగి సంతానలేమి సమస్యలకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అమ్మాయిల్లోనూ యోని ఇన్ఫెక్షన్లకు స్కిన్నీ జీన్స్ (Skinny jeans) కారణం అవుతుంటాయి. యువతీ యువకుల్లో చిన్న వయసులోనే కాళ్ల నొప్పులు, జలదరింపులు, తిమ్మిర్లు వంటి సమస్యలు తలెత్తడానికి బిగుతుగా ఉండే జీన్స్ కూడా ఓ కారణమే అంటున్నారు నిపుణులు. అందుకే ‘ట్రెండ్‌ను గుడ్డిగా ఫాలో అవకండి.. సౌకర్యం, ఆరోగ్యం కూడా ముఖ్యమని గుర్తించండి’ అంటున్నారు నిపుణులు.
Read More..
Shocking: డబ్బుల కోసం యూరిన్ స్టోర్ చేసి.. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ ఏం చేసిందో తెలుసా?