- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Body Positivity : శరీరాకృతిపై ఓవర్ కాన్ఫిడెన్స్‌తో పెరుగుతున్న రిస్క్!

దిశ, ఫీచర్స్ : రోజూ ఆహారం ఎంత ముఖ్యమో, మీపట్ల మీరు సానుకూల భావాలను, మీ శరీరంపట్ల శ్రద్ధను కలిగి ఉండటం కూడా ముఖ్యం అంటారు నిపుణులు. సంతోషంగా ఉండాలంటే మీ శరీన్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకోవాలని చెబుతుంటారు. అలాంటప్పుడే మనం ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహిస్తాం. పైగా ఈ రోజుల్లో బాడీ పాజిటివిటీ నిరంతరం కొనసాగే ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. చాలామంది తమ సంభాషణల్లో ఒక్కసారైనా దీనిగురించి ఆలోచించడమో, ప్రస్తావించడమో చేస్తుంటారు. ఇక సోషల్ మీడియా మొదలుకొని టీవీల్లో, సినిమాల్లో సన్నివేశాలు, కమర్షియల్ యాడ్స్ వరకు, మానవ శరీరానికి సంబంధించిన ఇన్ క్లూజివ్ ఇమేజింగ్ ప్రదర్శనే అధికంగా ఉంటున్న రోజులివి ఈ నేపథ్యంలో శరీర ఆకృతిపై ప్రతీ ఒక్కరిలో ఆసక్తి, క్యూరియాసిటీ పెరుగుతోంది. ఇది మంచిదే. కానీ ఓన్ బాడీ గురించి సానుకూల దృక్పథం మరీ ఎక్కువైనా కష్టమే. ఎందుకంటే శరీరాకృతిపై ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా పలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది అంటున్నారు నిపుణులు.
బాడీ పాజిటివిటీ ఎక్కువైనప్పుడు అది ఓవర్ కాన్ఫిడెన్స్‌కు దారితీసే అవకాశం ఉంది. దీంతో తమ శరీరం గురించి అనేక భ్రమలను కూడా కలిగి ఉంటారు. సన్నగా, నాజూగ్గా ఉన్నవారైతే ‘ఇక మాకేం పర్వాలేదు. బాగానే ఉన్నాం’ అనుకుంటారు. దీంతో జాగ్రత్తలు తీసుకోవడం మానేస్తారు. ఆహార నియమాలను, వ్యాయామాలను వదిలేస్తారు. ఇంకేముంది కొంత కాలానికి తమకు తెలియకుండానే బాడీ ఇమేజింగ్ మారిపోవచ్చు. పిల్లల విషయానికి బాడీ పాజిటివిటీ కొన్నిసార్లు వారిని సమస్యల్లోకి నెడుతోంది. బొద్దుగా, ముద్దుగా ఉన్నారంటూ పేరెంట్స్ గారాబం చేయడంతోపాటు పోషకాలు, కేలరీలతో సంబంధం లేకుండా కోరిన పదార్థాలన్నీ సమకూరుస్తుంటారు. మరికొన్నిసార్లు తమ పిల్లలు సన్నబడుతున్నారని అడిగిన పదార్థాలన్నీ తినిపించడం, కొనివ్వడం చేస్తుంటారు. ఈ పరిస్థితి కూడా కొంతకాలానికి మరో రకంగా మారుతుంది. చిల్ట్రన్స్‌లో అయితే శారీరక బలహీనత, అధిక బరువు, ఇతర శారీరక మార్పలు సంభవించే చాన్స్ ఉంటుంది. పిల్లల శరీరాకృతిపై పాజిటివిటీ అధికం కావడంవల్ల 2 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు గలవారిలో 20 శాతం మంది ఒబేసిటీని డెవలప్ చేసినట్లు ఇటీవలి అధ్యయనాలు పేర్కొంటున్నాయి. సో.. సన్నగా ఉన్నా, బొద్దుగా ఉన్నా రోజూ ఫిజికల్ యాక్టివిటీస్, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ముఖ్యం అంటున్నారు నిపుణులు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.