కూలింగ్ ప్లాంట్స్.. వేసవిలో ఇంటిని చల్లగా ఉంచే మొక్కలివే.. పెంచుకుంటే ఏసీ అవసరం లేదిక!

by Dishafeatures2 |
కూలింగ్ ప్లాంట్స్.. వేసవిలో ఇంటిని చల్లగా ఉంచే మొక్కలివే.. పెంచుకుంటే ఏసీ అవసరం లేదిక!
X

దిశ, ఫీచర్స్ : వేసవి కారణంగా పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇండ్లల్లో ఉంటున్నవారు కూడా ఉక్కబోతలతో ఇబ్బందులు పడుతున్నారు. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లవల్ల ఉపశమనం లభిస్తుండవచ్చు. కానీ అందరూ వాటిని వాడే పరిస్థితి ఉండకపోవచ్చు. మరికొందరికి అలర్జీలు సమస్య డండవచ్చు. ఇలాంటివారు అధిక ఉష్ణోగ్రతలకు తట్టుకోవాలంటే, చల్లదనాన్ని ఆస్వాదించాలంటే ఇండ్లల్లో కూలింగ్ ప్లాంట్స్ పెంచుకోవడం మేలు చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఆ మొక్కలేమిటో చూద్దాం.

ఫికస్ మొక్క

మొక్కలు, చెట్లు సహజంగానే చల్లదనాన్ని ఇస్తాయి. అయితే కేవలం ఇంటి ఆవరణలో పెంచుకోగలిగే చల్లదనాన్ని ఇచ్చే కొన్ని ప్రత్యేక మొక్కలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాతావరణాన్ని చల్లగా మార్చడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అలాంటి వాటిలో ఫికస్ మొక్కలు ఒకటి. వీటిని ఇంటి ఆవరణలో మట్టి కుండీలల్లో పెంచడం ద్వారా వేడి గాలిని శుద్ధిచేసి చల్లదనాన్ని ఇస్తాయని నిపుణులు అంటున్నారు.

బేబీ రబ్బర్ ప్లాంట్

చూడటానికి చిన్నగా ఉండే బేబీ రబ్బర్ ప్లాంట్ ఇంటిలో పెంచుకోవడానికి అనువైనది. పైగా ఈ మొక్కలకు డైలీ నీళ్లు కూడా పోయాల్సిన అవసరం లేదు. చుట్టు పక్కల వాతావరణాన్ని చల్లబరచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇంటి ఆవరణలో పెంచుకోవడం ద్వారా పరిసరాలు, ఇంటి వాతావరణాన్ని మిగతా ప్రదేశాలతో పోల్చితే చల్లగా మారుస్తాయి.

ఫెర్న్ ప్లాంట్

ఫెర్న్ మొక్క చల్లదనాన్ని ఇచ్చేదిగా ప్రసిద్ధి చెందింది. ఇండ్లల్లో పెంచుకుంటే వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగిస్తుందని చెప్తుంటారు. ఎందుకంటే ఇది గాలిలో తేమను పీల్చి తనలో స్టోర్ చేసుకునే గుణం కలిగి ఉంటుంది. వేడి వాతావరణాన్ని తట్టుకోవడానికి ఆ తేమను విడుదల చేస్తుంది. ఎటువంటి పువ్వులు, కాయలు ఉండవు. కేవలం ఆకులతో ఉండే ఈ మొక్క చల్లదనాన్ని ఇవ్వడంలో మాత్రం అద్భుతంగా పని చేస్తుంది. దీంతోపాటు కలబంద మొక్క కూడా చల్లదనాన్ని ఇస్తుందని నిపుణులు అంటున్నారు.

Next Story

Most Viewed