BREAKING: ఏపీలో మా మద్దతు ఆ పార్టీకే.. తేల్చేసిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ

by Shiva |
BREAKING: ఏపీలో మా మద్దతు ఆ పార్టీకే.. తేల్చేసిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ
X

దిశ, వెబ్‌‌డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే పలు ప్రధాన పార్టీలు ఎన్నికల కదనరంగంలో దూకాయి. ఓ వైపు టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి అధికార పార్టీని ఓడిచేందుకు ప్రజాక్షేత్రంలోకి వెళ్లాయి. మరోవైపు వైసీపీ తాము రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయనే నమ్మకంతో ప్రచారంలో ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే ఎంఐఎం చీఫ్ చేసిన ప్రకటన సీఎం జగన్‌కు ఊరట కలిగిస్తోంది. తాజాగా, ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో ఏపీలో తమ మద్దతు కచ్చితంగా సీఎం జగన్‌కే ఉంటుందని స్పష్టం చేశారు.

వైసీపీ గత ఐదేళ్ల కాలంలో పేదల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్నారు. మైనారిటీల హక్కులను పరిరక్షించేది జగన్ మాత్రమేనని అన్నారు. ఆంధ్రాలో టీడీపీ, జనసేన నటులైతే.. దేశం మొత్తానికి మోడీ మహా నటుడని ఎద్దేవా చేశారు. మోడీని ప్రశ్నించే దమ్ము చంద్రబాబకు ఉందా అని ప్రశ్నించారు. ఒకవేళ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే.. మోడీ చేతిలో బాబు కీలుబొమ్మ అవుతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీని ఢీకొట్టే సత్తా కేవలం జగన్‌కు మాత్రమే ఉందని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ముస్లీం మైనారిటీలు అంతా వైసీపీకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed