- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వివాహానికి ముందు ఈ పరీక్ష చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. ఎందుకంటే..?
దిశ, ఫీచర్స్ : మనదేశంలో పెళ్లికి ముందు జాతకాలను చూసి పెళ్లిళ్లు చేస్తుంటారు. జాతకాలు కలవకపోతే, ఆ సంబంధం తెగిపోయే అవకాశం ఉందని నమ్ముతారు. పెళ్లికి ముందు మంచి శారీరక స్థితి వధూవరులకు చాలా ముఖ్యం. అందుకే పెళ్లి తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంలో, వివాహానికి ముందు జంటలు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. రక్త పరీక్ష ఖచ్చితంగా చేయించుకోవాలని చెబుతున్నారు. ఈ పరీక్ష చేపించుకోవడానికి సంకోచించకండి. దీని వల్ల ఆరోగ్యం గురించి తెలుస్తుంది. అసలు పెళ్లికి ముందు రక్త పరీక్ష ఎందుకు చేపించుకోవాలో ఇక్కడ చూద్దాం..
భవిష్యత్తులో సంతానం, పిల్లలకు ఆరోగ్యకరమైన జీవితం కోసం రక్త పరీక్షలు చేపించుకోవాలి. తల్లి దండ్రుల బ్లడ్ గ్రూప్ ను బట్టి పిల్లలు భవిష్యత్తులో అనేక తీవ్రమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. తల్లిదండ్రుల్లో ఎవరికైనా నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే పుట్టుకతోనే రక్తప్రసరణ ఎక్కువగా జరగడం వంటి సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
దంపతుల బ్లడ్ గ్రూప్ సరిపోలకపోతే గర్భధారణ సమయంలో సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల, భాగస్వాములు ఒకే Rh కారకాన్ని కలిగి ఉండటం ముఖ్యం. అలాంటి సందర్భాలలో, వివాహానికి ముందు రక్త పరీక్ష చాలా ముఖ్యం.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.