- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంచు రహితంగా మారుతున్న ఆర్కిటిక్.. పర్యావరణ వ్యవస్థకు ప్రమాదం పొంచి ఉందా?
దిశ, ఫీచర్స్ : గ్లోబల్ వార్మింగ్ ప్రభావం ఇప్పటికే వివిధ రూపాల్లో ప్రజలను ప్రభావితం చేస్తోంది. రోజురోజుకూ మారుతున్న ఉష్ణోగ్రతల కారణంగా అనేక దేశాల్లో వేడి పెరుగుతోంది. వాయు, నీటి, వాతావరణ కాలుష్యాలవల్ల వివిధ వ్యాధులు, అనారోగ్యాలు సంభవిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఆ ప్రభావం ఆర్కిటిక్ మహాసముద్రంపై కూడా పడిందని నేచర్ రివ్యూస్ ఎర్త్ & ఎన్విరాన్‌మెంట్ జర్నల్ అధ్యయనంలో వెల్లడైంది.
హీట్‌వేవ్ కారణంగా ఇప్పటికే ఆర్కిటిక్ మహా సముద్రంలో, దాని పరిసరాల్లో ఎల్లప్పుడూ ఉండే మంచు పెద్ద ఎత్తున కరిగిపోతోంది. అయితే తిరిగి కొత్త మంచు చరియలు ఏర్పడటం గతంకంటే చాలా తగ్గిపోయింది. పెరుగుతున్న గ్రీన్ హౌస్ వాయువులు, కర్బన ఉద్గారాలు వల్ల రాబోయే రెండేళ్లలో ఆర్కిటిక్ మరింత మంచు రహితంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధ్యయనంలో భాగంగా కొల్ కతా యూనివర్సిటీ, అలాగే ఇన్‌స్టిట్యూ్ట్ ఆఫ్ ఆర్కిటిక్ అండ్ ఆల్పైన్ రీసెర్చ్ విభాగానికి చెందిన పరిశోధకులు ఇటీవల వివిధ సముద్ర వాతావరణాలకు సంబంధించిన గత అధ్యయనాల డేటాను విశ్లేషించారు. దీంతోపాటు తాజాగా సంభవిస్తున్న మార్పులను కూడా పరిశీలించారు. ఆర్కిటిక్‌లో ప్రస్తుతం వేడెక్కుతున్న వాతావరణం రీత్యా మంచు కరుగుతోందని, తిరిగి అది ఏర్పడే పరిస్థితి లేకుండా పోయిందని కనుగొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి ఆర్కిటిక్ పూర్తిగా మంచు రహితంగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ప్రపంచ పర్యావరణ వ్యవస్థకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని చెప్తున్నారు.