Diabetes : అలర్ట్.. మీరు షుగర్ పేషంట్లైతే గనుక తినకూడని పండ్లు ఇవే..

by Javid Pasha |   ( Updated:2025-02-22 07:20:57.0  )
Diabetes : అలర్ట్..  మీరు షుగర్ పేషంట్లైతే గనుక  తినకూడని పండ్లు ఇవే..
X

దిశ, ఫీచర్స్ : పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలిసిందే. వీటిలోని పోషకాలవల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచడం ద్వారా పలు వ్యాధుల ముప్పును తగ్గిస్తాయి. కానీ డయాబెటిస్ ఉన్నవారు మాత్రం ఈ విషయంలో జాగ్రత్త పడాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే కొన్ని రకాల ఫ్రూట్స్‌లో చక్కెరస్థాయిలు అధికంగా ఉంటాయని ‘‘గ్లైసెమిక్ ఇండెక్స్ ఆఫ్ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్’’ అధ్యయనంలోనూ వెల్లడైందని, 2002 నాటి అధ్యయనం కూడా ఇదే పేర్కొన్నదని చెబుతున్నారు.

*అరటి పండ్లు : అరిటి పండ్లు సాధారణంగానే ఆరోగ్యానికి మంచిది. ఇందులో ఫైబర్ ఉంటుంది. మలబద్ధకాన్ని తొలగిస్తుంది. జీర్ణక్రియ ఆరోగ్యానికి మంచిది. కానీ ఎక్కువగా పండిన ఈ పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. కాయల్లో అయితే 42 నుంచి 62 వరకు ఉంటుంది. కాబట్టి మధుమేహం ఉన్నవాళ్లు వీటిని తక్కువగా తినాలి.

*పైనాపిల్ : పైనాపిల్‌లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. సాధారణంగానే ఆరోగ్యానికి మంచిది. అయితే నేచుల్ షుగర్ కంటెంట్ ఇందులో ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల డయాబెటిస్ బాధితులు తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే చాన్స్ ఉంటుంది. అందుకే తక్కువ మోతాదులో తినాలని చెబుతున్నారు.

*పుచ్చకాయ : వేసవిలో ఎక్కువ మంది తినడానికి ఇష్టపడే రుచికరమైన ఫలం పుచ్చకాయ. ఇందులో అనేక పోషకాలుంటాయి. కానీ గ్లైసెమిక్ ఇండెక్స్ మాత్రం 80 వరకు ఉంటాయి. అంటే సాధారణ స్థాయి దాటుతాయి. కాబట్టి దీనిని తినడంవల్ల షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుందని, డయాబెటిస్ బాధితులు తినకపోవడం లేదా తక్కువగా తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

* మామిడి : వేసవిలో వచ్చే మరో సీజనల్ ఫ్రూట్ మామిడి. ఇది కూడా షుగర్ పేషెంట్లు ఎక్కువగా తినాల్సిన ఫలం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయిలు 51 నుంచి 60 వరకు ఉంటాయి. అయినప్పటికీ ఫ్రక్టోజ్, సూక్రోజ్ శాతం కూడా ఎక్కువే. కాబట్టి షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంచుకోవాలనుకుంటే ఈ పండును తక్కువగా తినాలంటున్నారు నిపుణులు. ఇక ద్రాక్షలో, చెర్రీ పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ కాస్త తక్కువగానే ఉన్నా ఈ పండ్లు చిన్నగా ఉండటంవల్ల ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తు్న్నారు.

గ్లైసెమిక్ ఇండెక్స్ ప్రభావం

మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై పరోక్షంగా ప్రభావం చూపుతుంటాయనే విషయం తెలిసిందే ప్రతి రోజూ తీసుకునే ఆహారంలోని కార్బో హైడ్రేట్స్ వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు పెరుగుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎంత మేర పెరుగుతాయో తెలియజేసే కొలమానమే గ్లైసెమిక్ ఇండెక్స్. అయితే మనం తీసుకునే ఆహారంలో షుగర్ లెవెల్ 55కు మించకుండా ఉంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ అని, 56 నుంచి 69 మధ్య ఉంటే మిడిల్ లెవెల్ అని, 70కి మించితే అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి షుగర్ ఉన్నవాళ్లు మాత్రం తక్కువ స్థాయి గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలే తినాలి. ఇది ఎక్కువగా ఉండే పండ్లను తినకూడదని, తినాల్సి వస్తే తక్కువగా తినాలని చెబుతున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించాలి.

Read More : చండ్రు సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఈ సింపుల్ హోమ్ రెమెడీస్ మీ కోసమే.

Next Story

Most Viewed