షాపింగ్‌ చేస్తున్నారా?.. ఖర్చు తగ్గాలంటే ఇలా ప్లాన్ చేసుకోండి !

by Javid Pasha |
షాపింగ్‌ చేస్తున్నారా?.. ఖర్చు తగ్గాలంటే ఇలా ప్లాన్ చేసుకోండి !
X

దిశ, ఫీచర్స్ : షాపింగ్ చేయడం ఒక అవసరం మాత్రమే కాదు, అదొక క్యూరియాసిటీగానూ ఉంటుంది. అందుకే చాలామంది బయటకు వెళ్లి రకరకాల వస్తువులు, దుస్తులు కొనడానికి ఉత్సాహం చూపుతుంటారు. కొందరు తమకు షాపింగ్ చేయాల్సిన అవసరం లేకపోయినా ఫ్రెండ్స్ లేదా కొలీగ్స్‌తో కలిసి షాపింగ్‌కి వెళ్తుంటారు. అయితే షాపింగ్ చేయడం అనేది బడ్జెట్‌తో ముడిపడి ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బంది పడతారని, నిపుణులు చెప్తున్నారు. అందుకోసం ఏం చేయాలో సూచిస్తున్నారు.

ముందుగానే బడ్జెట్‌ ప్లాన్

మీరు షాషింగ్‌‌కు వెళ్లడానికి మందే ఒక ప్లాన్ చేసుకోవాలి. బడ్జెట్‌ నిర్ణయించుకోవాలి. మీరు నిర్ణయించుకున్నదానికంటే ఒక్క పైసా కూడా ఎక్కువగా ఖర్చు చేయకూడదు. అందులోనే అన్ని వస్తువులు తీసుకురావడానికి ట్రై చేయాలి. కంపెనీలు, ఆన్‌లైన్‌లో ఉండే ఆఫర్లను చూసి టెమిట్ కావ్దు. లిమిట్‌లో వచ్చే బెస్ట్‌ వాటిని కొనుగోలు చేసేలా ప్లాన్‌ చేసుకోవాలి.

లిస్ట్ రెడీ చేసుకోండి

కొందరు ఇంట్లో ఉన్నప్పుడు ఏవేవో కొనాలని అనుకుంటారు. తీరా అక్కడికి వెళ్లే సరికి మర్చిపోతుంటారు. అందుకని షాపింగ్‌ వెళ్లేటప్పుడు ముందుగానే కావాల్సిన వస్తువులు సీరియల్ నెంబర్ ప్రకారం లిస్టు రెడీ చేసుకోండి. పేపర్ రాసి మీ ఫోన్ ద్వారా ఫొటో తీసుకొని కూడా వెళ్లొచ్చు. చాలామంది రిటైలర్లు వ్యూహాత్మకంగా క్యాష్‌ అండ్ చెక్‌ అవుట్‌ కౌంటర్ల వద్ద ఆకర్షణీయ వస్తువులను ప్రదర్శనలో ఉంచుతారు. వాటిపై దృష్టి కేంద్రీకరించకపోవడమే మంచిది. లిస్ట్‌లో రాసుకున్నవాటినే కొనుగోలు చేయడం వల్ల మీకు టైంతోపాటు బడ్జెట్ ఆదా అవుతుంది.

రేట్లను పోల్చి చూసుకోండి

ధరల విషయంలో కొందరు ఇబ్బంది పడుతుంటారు. ఇలా జరగవద్దనుకుంటే షాపింగ్‌ చేసేటప్పుడు వివిధ షాపులలో, ఆన్‌లైన్‌లో ఉండే వస్తువుల ధరలను పోల్చి చూడాలి. దీనివల్ల మీకు కావాలసిన వస్తువులు కొనుగోలు చేస్తున్నవద్ద ఏ రేటుకు లభిస్తున్నాయి. మరోచోట తక్కువకు ఏమైనా లభిస్తాయా? అనేది తెలిసిపోతుంది. పెద్ద పెద్ద దుకాణాల్లో, ఆన్‌లైన్‌ రిటైలర్స్‌ వద్ద కొన్నిసార్లు స్పెషల్ ఆఫర్లు ఉంటాయి. ఎక్కువ కొనుగోలు చేసినప్పుడు డిస్కౌంట్స్‌ మరింతగా ఉండొచ్చు. కాబట్టి, ధరల విషయంలో వివిధ షాపుల రేట్లను పోల్చి చూసుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు.

ఎక్కువగా కొనాలనుకుంటే ..

తక్కువ వస్తువులు అయినప్పుడు ఎక్కడైనా కొన్నా ఇబ్బంది అనిపించకపోవచ్చు. కానీ కొన్ని రకాల వస్తువులు పెద్ద మొత్తంలో అవసరమైతే రిటైల్‌ షాప్‌లో కాకుండా హోల్‌సేల్‌ షాపులలో కొనుగోలు చేయడం బెటర్. దీనివల్ల బడ్జెట్ ఆదా అవుతుంది. ఇక చాలామంది షాపింగ్ సమయంలో డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డులను ఉపయోగిస్తారు. యూపీఐ చెల్లింపులు చేస్తారు. దీనివల్ల ఎంత చెల్లిస్తున్నామో తెలియకుండా పోతుంది. అందుకే షాపింగ్‌‌కు వెళ్లేటప్పుడు ముందుగానే నిర్ణయించుకున్న మేర నగదను తీసుకెళ్లడం బెటర్.

Advertisement

Next Story

Most Viewed