కొందరికి లివర్ ఎందుకు డ్యామేజ్ అవుతుంది?.. లివర్ సిర్రోసిస్ అంటే ఏమిటి?

by Javid Pasha |
కొందరికి లివర్ ఎందుకు డ్యామేజ్ అవుతుంది?.. లివర్ సిర్రోసిస్ అంటే ఏమిటి?
X

దిశ, ఫీచర్స్ : ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా లివర్ సిర్రోసిస్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. వరల్డ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆర్గనైజేషన్ ప్రకారం 2021లో సంభవించిన అత్యధిక మరణాలకు ఇది కూడా ఒక ప్రధాన కారణం. సుమారు 7 లక్షల 80 వేలమంది అప్పట్లో ఈ వ్యాధిబారిన పడ్డారు. ఇండియాలో అయితే ఏటా రెండు లక్షల మందికి లివర్ డ్యామేజ్ సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. శరీరంలో ప్రోటీన్ లెవల్స్ బాగా పడిపోవడం, కాలేయ కణాలు దెబ్బతినడంవల్ల వాటి సామర్థ్యం తగ్గిపోవడాన్నే లివర్ సిర్రోసిస్‌గా పేర్కొంటారు.

మన దేశంలో లివర్ సంబంధిత అనారోగ్యాలకు ప్రధాన కారణం ఆల్కహాల్ కూడా ఒకటి. దీనికి అడిక్ట్ కావడంవల్ల క్రమంగా సిర్రోసిస్ ప్రాబ్లమ్స్ తలెత్తే చాన్స్ ఉంటుంది. దీంతోపాటు హెపటైటిస్ బి, సి, వంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా కారణం అవుతాయి. కాగా 25 నుంచి 30 శాతం వరకు సమస్యలకు ప్రధాన కారణం మాత్రం ఆల్కహాల్. ఆల్కహాల్ అలవాటులేనివారిలోనూ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ తలెత్తుతుంటాయి.

సింప్టమ్స్

ఇక లివర్ సిర్రోసిస్‌ లక్షణాలను త్వరగా గుర్తిస్తే రిస్కు నుంచి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు. దీనిబారిన పడిన వారిలో సాధారణంగా కనిపించే మొదటి లక్షణం తీవ్రమైన అలసట. బాడీలో ప్రోటీన్ లెవెల్స్ పడిపోవడంవల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఫలితంగా శరీరంలోని వివిధ భాగాల్లో, కాళ్లల్లో వాపు కనిపిస్తుంది. పొత్తికడుపులో లిక్విడ్స్ వంటి పదార్థాలు పేరుకుపోయిన ఫీలింగ్ కలగడం, పొట్ట ఉబ్బినట్లుగా అనిపిస్తుంది. కొన్నిసార్లు వాంతింగ్స్‌తో పాటు నోటి నుంచి బ్లడ్ పడటం గమనించవచ్చు. అంతేకాకుండా లివర్ సిర్రోసిస్ బాధితుల్లో కామెర్ల వ్యాధి తీవ్రం అవుతుంది. కళ్లు పసుపు పచ్చగా మారుతాయి.

ట్రీట్మెంట్ ఆప్షన్స్

లివర్ సిర్రోసిస్ కన్ఫామ్ అయితే గనుక మెరుగైన ట్రీట్‌మెంట్ తప్పక అవసరం. ముఖ్యంగా ప్రారంభ దశలో ఉంటే హెపటైటిస్ బి, సి మెడికేషన్స్‌తో దీనిని కంట్రోల్ చేయవచ్చు.అలాగే మద్యపానం లేదా ఆల్కహాల్ వల్ల కలిగిన లివర్ డిసీజెస్‌ను చికిత్స ద్వారా నివారించవచ్చు. ఇక లివర్ డ్యామేజ్ అయితే మాత్రం మందులతో తగ్గదు. ఇలాంటప్పుడు లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్‌‌ సర్జరీ తప్ప మరో మార్గం లేదంటున్నారు వైద్య నిపుణులు చెప్తున్నారు. అలా కాకుండా లివర్ డ్యామేజ్‌కు ముందే వ్యాధిని గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే 80 శాతం వరకు మెడికేషన్స్ ద్వారా కోలుకునే చాన్స్ ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed