Kids and Tea : పిల్లలకు కాఫీ, టీలు ఇవ్వడం మంచిది కాదా..? ఏ వయసు నుంచి తాగొచ్చు?

by Javid Pasha |   ( Updated:2025-01-31 15:48:41.0  )
Kids and Tea : పిల్లలకు కాఫీ, టీలు ఇవ్వడం మంచిది కాదా..? ఏ వయసు నుంచి తాగొచ్చు?
X

దిశ, ఫీచర్స్ : పొద్దున్న లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. పైగా మన దేశంలో ఈ పానీయాలకు క్రేజ్ ఎక్కువ. ఒక కప్ గరం గరం చాయ్ తాగనిదే తమకేం తోచదని, తాగకుంటే తలనొస్తుందని చెబుతుంటారు. అయితే పిల్లలకు మాత్రం ఈ పానీయాలు ఇవ్వడం అంతమంచిది కాదని అంటుంటారు. హెల్త్ ఎక్స్‌పర్ట్స్ సైతం అదే చెబుతున్నారు. ఎదిగే వయసులో టీ, కాఫీలు చిన్నారులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొంటున్నారు. కాగా ఏ వయసు నుంచి వీటిని తీసుకోవడం మంచిదనే సందేహాలు కూడా పలువురు వ్యక్తం చేస్తుంటారు. నిపుణుల సమాధానమేమిటో ఇప్పుడు చూద్దాం.

పిల్లలకు టీ, కాఫీ వంటి పానీయాలు ఇవ్వడంవల్ల వాటిలోని టానిన్లు, అధిక కెఫిన్ శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా కెఫిన్ వల్ల పిల్లల శరీరంలో కాల్షియం, ఇతర పోషకాల లోపం ఏర్పడుతుందని, ఎముకల బలహీనతకు, అసలటకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి 18 ఏండ్లలోపు వారు టీ, కాఫీ వంటివి తీసుకోకపోవడం మంచిదని సూచిస్తున్నారు. ఒకవేళ తప్పదనుకుంటే డైలీ ఒకటి లేదా రెండు కప్పుల వరకు మాత్రమే తక్కువ పరిమాణంలో తీసుకోవచ్చునని చెబుతున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.


Read Also..

కోడిగుడ్ల‌ను ప‌చ్చిగా తాగొచ్చా..? తాగితే ఏం జ‌రుగుతుందో తెలుసా?


Next Story

Most Viewed