- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బయట తిరగడం మానేస్తే ప్రమాదంలో పడ్డట్లే.. శరీరంలో జరిగే హానికర మార్పులివే..
దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు మనుషులు ఎక్కువగా ప్రకృతితో మమేకమై ఉండేవారు. నివాసాలు ఉన్నప్పటికీ తమ జీవితంలో ఎక్కువ భాగం బయటి వాతావరణ పరిస్థితుల్లోనే గడపాల్సి వచ్చేది. వ్యవసాయం, పశుపోషణ, వివిధ పనులు చేయడం వల్ల ఇదంతా జరిగేది. ఫలితంగా శారీరక శ్రమ, సూర్యరశ్మి వంటివి సహజంగానే లభించడంతో మానసిక, శారీరక ఆరోగ్యాలు కూడా బాగుండేవి. కానీ ఆధునిక జీవనశైలి అందుకు భిన్నంగా ఉంటోంది. చాలా మంది ఎక్కువ సమయం ఇండ్లు, ఆఫీసుల్లోనే గడపడం, బయటి పరిస్థితుల్లో తక్కువ సమయం స్పెండ్ చేయడంవల్ల పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అవేమిటో చూద్దాం.
మానసిక స్థితిలో మార్పులు
బయట పరిసరాల్లో సమయాన్ని స్పెండ్ చేయకపోవడం లేదా తక్కువగా స్పెండ్ చేయడం లేదంటే తగినంత సూర్య రశ్మి అందడం లేదని అర్థం. దీంతో మూడ్ స్టెబిలైజర్‌లో ముఖ్యపాత్ర పోషించే సెరోటోనిన్ హార్మోన్ లెవల్స్ తగ్గుతాయి. వాస్తవానికి ఇదొక న్యూరో ట్రాన్స్‌మిటర్. ఫీల్ గుడ్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. బయట తిరగడం మానేస్తే ఇది ఉత్పత్తి కాదు. దీంతో మానసిక ఆందోళన, శారీరక అనారోగ్యాలు సంభవిస్తాయని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నిపుణుల అధ్యయనంలో వెల్లడైంది.
సర్కాడియన్ రిథమ్‌పై ప్రభావం
సహజమైన కాంతికి గురికావడం, ముఖ్యంగా ఉదయపు వేళ వాతావరణాన్ని ఆస్వాదించడం అనేది మానవుల సర్కాడియన్ రిథమ్(స్లీప్ సైకిల్)కు చాలా ముఖ్యం. ఎందుకంటే నేచురల్ కాంతి మనిషిలో నిద్రకు అవసరమైన మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. సహజంగా ఇది నిద్రవేళకు ముందు పెరుగుతుంది. మేల్కొన్న తర్వాత పడిపోతుంది. కాబట్టి పగటిపూట బయటకు వెళ్లకపోవడం ఈ ప్రక్రియకు ఆటకం కలిగిస్తుంది.
క్యాబిన్ ఫీవర్ - మానసిక ఒత్తిడి
‘‘క్యాబిన్ ఫీవర్ ’’అనే పదాన్ని తరచుగా ఒక క్లోజ్డ్ స్పేస్‌లో ఎక్కువకాలం గడపడంవల్ల అనుభవించే ఇబ్బంది కరమైన అనుభూతల పరిధిని వివరించడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా విసుగు, ఆందోళన, సాధారణ అసంతృప్తి వంటివి క్యాబిన్ ఫీవర్‌లో భాగమే. బయటి పరిస్థితుల్లో గడపకపోతే ఇటువంటి ఫీవర్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు రోగ నిరోధక శక్తి తగ్గడం, మానసిక ఒత్తిడి పెరగడం, వివిధ అలెర్జీల బారిన పడటం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.
బాడీ పెయిన్స్ వేధిస్తాయి
మనుషులు ఎక్కువ రోజులు ఎలా స్పెండ్ చేస్తున్నారనే దానితో సంబంధం లేకుండా సహజంగానే కొన్ని రకాల శారీరక నొప్పులను అనుభవిస్తంటారు. కానీ బయటకు వెళ్లకపోవడం అనారోగ్యకరమైన శారీరక నొప్పులు అనుభవిస్తారు. ఎందుకంటే సూర్యరశ్మి తక్కువగా ఉండటం ఫలితంగా విటమిన్ డి లెవల్ తగ్గుతుంది. దీంతో శరీరం, కండరాలు, కీళ్ల నొప్పులు వస్తాయి. అలాగే విటమిన్ డి లోపించడం కారణంగా పేగుల్లో అసౌకర్యం ఏర్పడుతుంది. క్రమంగా ఇన్‌ఫ్లమేటరీ బౌల్ డిసీజ్‌కు దారితీస్తుది.
క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది
బయటకు వెళ్లడం మానేస్తే శరీరానికి సూర్యరశ్మి లభించదు. ఇది చర్మ క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. కామన్వెల్త్ మెడికల్ కాలేజీకి చెందిన పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. వివిధ రకాల క్యాన్సర్లను అనుభవిస్తున్న మూడు వంతుల మంది క్యాన్సర్ పేషెంట్లలో విటమిన్ డి లెవల్స్ చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అందుకు కారణం వారు బయటి పరిస్థితుల్లో సమయాన్ని స్పెండ్ చేయకపోవడమే.
జ్ఞాపకశక్తి తగ్గుతుంది
మనుషులు బయటకు వెళ్లడం మానేసి, పూర్తిగా ఇంటిపట్టునే ఉండటం ప్రారంభిస్తే జ్ఞాపకశక్తి కూడా తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు. 2008లో మిచిగాన్ యూనివర్సటీ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. ప్రకృతిలో, పరిసరాల్లో గడపడం, నడవడం వంటి యాక్టివిటీస్ మతిమరుపును పోగొట్టి.. 20 శాతం మేర జ్ఞాపశక్తిని పెంచాయి. అంతేకాదు నిరుత్సాహం, అలసట, కంటిచూపు లోపాలు వంటి సమస్యలన్నీ బయట తిరగకపోవడంవల్ల వస్తాయి. వీటన్నింటికీ చక్కటి పరిష్కారం వీలైనంత ఎక్కువగా నేచర్‌తో స్పెండ్ చేయడమే.
Read More : వేసవిలో హెవీ వర్కవుట్స్ ప్రమాదకరం.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
- Tags
- health tips