పిల్లల్ని కనడంలో ఆలస్యం చేస్తున్నారా?.. 40 ఏండ్ల తర్వాత గర్భధారణ అంత సేఫ్ కాదంటున్న నిపుణులు

by Javid Pasha |
పిల్లల్ని కనడంలో ఆలస్యం చేస్తున్నారా?.. 40 ఏండ్ల తర్వాత గర్భధారణ అంత సేఫ్ కాదంటున్న నిపుణులు
X

దిశ, ఫీచర్స్ : పెళ్లైన తర్వాత సంతానం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ కొందరికి ఆరోగ్యపరమైన సమస్యలు, వంధ్యత్వం కారణంగా ప్రెగ్నెన్సీ ఆలస్యం అవుతూ ఉంటుంది. మరి కొందరు ఇప్పుడే పిల్లలు వద్దు అనుకొని వాయిదా వేస్తుంటారు. కారణాలేమైన ఆలస్యంగా గర్భం ధరించడం స్త్రీల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, పలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెప్తున్నారు. అవేమిటో చూద్దాం.

* 40 ఏండ్ల తర్వాత గర్భధారణతో డెలివరీ సమయంలో ఇబ్బందులు ఎదురు కావచ్చు. అంతేకాకుండా 35 ఏళ్ల తర్వాత మహిళల్లో సంతానానికి దోహదం చేసే అండాల పరిమాణం, నాణ్యత తగ్గుతుంది. దీనికి తోడు జన్యుపరమైన లోపాలు తలెత్తుతాయి. వయస్సు పెరిగే కొద్దీ ఎండో మెట్రియోసిస్, యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ సమస్యలు మహిళల్లో పెరుగుతాయి. కాబట్టి లేట్ ప్రెగ్నెన్సీ సేఫ్ కాదు.

* గర్భధారణ సమయంలో చాలా మంది మహిళలకు డయాబెటిస్ వచ్చి, డెలివరీ తర్వాత తగ్గిపోతూ ఉంటుంది. ఈ పరిస్థితిని గెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. అయితే 40 ఏళ్లు దాటిన వారిలోనే ఈ సమస్యలు ఎక్కువ. ప్రీ ఎక్లాంప్సియా, గెస్టేషనల్ డయాబెటిస్, గెస్టేషనల్ హైపర్ టెన్షన్ లేట్ వయస్సు ప్రెగ్నెన్సీలో వస్తే అలాగే కొనసాగే అవకాశం ఉంటుంది.

* లేటు‌గా గర్భం ధరించిన మహిళలకు నార్మల్ డెలివరీలు కాకపోవడం, లేకపోతే గర్భం నిలిచిన రెండు మూడు నెలలకు అబార్షన్ అవ్వడం, నెలలు నిండకుండానే డెలివరీ కావడం వంటివి జరుగుతుంటాయి. కాబట్టి 40 ఏళ్ల తర్వాత ప్లాన్ చేసుకోకపోవడం గర్భధారణ అంత సురక్షితం కాదంటున్నారు వైద్య నిపుణులు.

* పలు ఆరోగ్య నివేదికల ప్రకారం.. లేటు వయస్సు ప్రెగ్నెన్సీ కారణంగా ఫీటల్ మాక్రోసోమియా ప్రాబ్లం పెరుగుతుంది. అంటే పుట్టబోయే పిల్లలు చాలా తక్కువ బరువుతో కానీ లేదా అధిక బరువుతో కానీ పుట్టే అవకాశం ఉంటుంది. అందుకే దంపతులు 35 ఏళ్లలోపే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోడం మంచిదని నిపుణులు సూచిస్తుంటారు. ఇక తప్పని పరిస్థితుల్లో 40 ఏండ్లు ఆ తర్వాత గనుక ప్రెగ్నెంట్ అయితే వైద్య నిపుణుల సూచనలు తప్పక పాటించాలి. సేఫ్ డెలివరీకోసం అవసరమైన లైఫ్ స్టైల్‌ను అలవర్చుకోవాలి.

Advertisement

Next Story

Most Viewed