- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Elephant Yam : మేని సోయగాన్ని పెంచే కందగడ్డ.. తింటే ఎన్ని లాభాలో..

దిశ, ఫీచర్స్ : చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ముఖంపై గ్లామర్ తగ్గిందా? ఆందోళన అవసరం లేదు. కందగడ్డ(Elephant Yam)ను మీ డైట్‌లో చేర్చుకుంటే చాలు అంటున్నారు ఆయుర్వేదిక్ చిట్కా వైద్యులు. ఏనుగు పాదాన్ని పోలి ఉండే ఈ కూరగాయ చూడటానికి అంతగా ఆకట్టుకోకపోవచ్చు. వండటంలో కాస్త ఎక్కువ సమయం తీసుకోవడం కారణంగా కొందరు దీనిని తినడానికి ఇష్టపడకపోవచ్చు. కానీ ఆరోగ్యానికి మాత్రం సూపర్ ఫుడ్. అందులోని పోషకాల కారణంగా తింటే అనేక లాభాలున్నాయని ఆహార నిపుణులు చెప్తున్నారు. అందాన్ని, చర్మ సౌందర్యాన్ని మెరుగు పర్చే పోషకాలన్నీ ఇందులో ఉంటాయి. దీంతో మేనిఛాయ మెరుగుపడుతుంట.
కందగడ్డకు శరీరంలోని అధిక వేడిని, రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం ఉంటుంది. ముఖ్యంగా గుండె జబ్బులు వంటివి రా కుండా నివారించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. దీంతోపాటు బీటా కెరోటిన్, విటమిన్ బి6, విటమిన్ సి, మినరల్స్ ఉంటాయి. ఇవన్నీ గుండె జబ్బులను నివారిస్తాయి. అలాగే చర్మాన్ని మృదువుగా ఉంచడంలో, ముడతలను నివారించడంలో దోహదపడతాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. అందుకే కందగడ్డను ఆహారంలో భాగంగా తీసుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
బీటా కెరోటిన్, విటమిన్ బి6, విటమిన్ సి, మినరల్స్ కందగడ్డలో ఫుల్లుగా ఉంటాయి. ఇవన్నీ గుండె జబ్బులను నివారించడంలో సహాయపడతాయి. అలాగే చర్మాన్ని మృదువుగా ఉంచడంలో, ముఖంపై ముడతలను నివారించడంలో దోహదపడతాయి. కందగడ్డను తినడంవల్ల అందులోని పోషకాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, ఫైబర్ కంటెంట్ వంటివి కందగడ్డలో అధికంగా ఉండటంవల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇది పేగులు, జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. అందుకే కందగడ్డను తినాలని ఆయుర్వేదిక్ నిపుణులు సూచిస్తుంటారు. తినడంవల్ల ఆరోగ్యానికి అన్ని రకాలుగా మేలు జరుగుతుందని చెప్తున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.