Pet dogs : కుక్కలు మనిషిలోని ఆ పార్టునే ఎందుకని ఎక్కువగా వాసన చూస్తాయి?.. నిపుణులు చెప్తున్నది ఇదే..

by Dishafeatures2 |
Pet dogs : కుక్కలు మనిషిలోని ఆ పార్టునే ఎందుకని ఎక్కువగా వాసన చూస్తాయి?.. నిపుణులు చెప్తున్నది ఇదే..
X

దిశ, ఫీచర్స్ : కుక్కలు విశ్వసనీయమైన జంతువులనే విషయం తెలిసిందే. పెంచుకున్న యజమానిని కంటికి రెప్పలా కాపాడుతాయి. అందుకే అవి మోస్ట్ హ్యూమన్ ఫ్రెండ్లీ యానిమల్స్‌గా పాపులారిటీ పొందాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది పెట్ డాగ్స్‌ను పెంచుకుంటున్నారు. వాటిని తమ కుటుంబంలో భాగంగా చూసుకుంటున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు వాటిని ఎంతో గారాబంగా చూస్తూ.. ఆడుకుంటూ మీరు ఏదో ఒక సందర్భంలో చూసే ఉంటారు.

అయితే మీరెప్పుడైనా ఈ విషయం గమనించారా? పెట్ డాగ్స్ మన దగ్గరకు కానీ, పరిచయం ఉన్న ఇతర వ్యక్తులు, జంతువుల వద్దకు వచ్చినప్పుడు కానీ తోక ఊపుతూ, ఆప్యాతను ప్రదర్శిస్తూ వింతగా ప్రవర్తిస్తాయి. ఆ తర్వాత కాళ్లను, నడుము భాగాన్ని, ప్రైవేట్ పార్టులను వాసన చూస్తుంటాయి. చాలా మందికి కుక్కలు అలా ఎందుకు ప్రవర్తిస్తాయనే సందేహం వచ్చినా ఏమనుకుంటారో అని ఇతరులను అడిగి ఉండకపోవచ్చు. కానీ అందుకు గల కారణాలేమిటో నిపుణులు వివరిస్తున్నారు.

వాస్తవానికి కుక్కల్లో ముక్కు భాగం గొప్ప గ్రహణ శక్తిని కలిగి ఉంటుంది. మనిషి ముక్కులో సుమారు 50 లక్షల నుంచి కోటి వరకు నాసికా గ్రాహకాలు ఉంటే.. కుక్కల్లో మాత్రం ఇవి దాదాపు 22 కోట్ల వరకు ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే మనిషి గ్రహణ శక్తికన్నా కుక్కల గ్రహణ శక్తి నాలుగైదు రెట్లు అధికం. ఈ విధమైన స్మెల్ పవర్ వల్లే అవి ఎదురుగా ఉన్న జంతువు లేదా మనిషి సెక్స్ ఏంటి? శరీరంలో విడుదలవుతున్న హార్మోన్స్ ఏమిటి?, ఆరోగ్య పరిస్థితి ఏమిటి? అనేది గ్రహిస్తాయని అమెరికన్ నేచురల్ మ్యూజియానికి చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఒక్కసారి వాసన చూసిన జంతువును, మనిషిని, వస్తువును కుక్కలు ఇట్టే గుర్తుంచుకుంటాయని, విశ్వసనీయత, గ్రహణశక్తి అధికంగా ఉండటంవల్లే అవి నేడు అనేక నేర పరిశోధనల్లో, మిస్టరీల ఛేదింపులో కీలకంగా మారుతున్నాయని నిపుణులు అంటున్నారు.



Next Story