రోబోట్స్‌తో రొమాన్స్.. భావోద్వేగాలు, భావప్రాస్తి కూడా సాధ్యమేనట..

by Javid Pasha |
రోబోట్స్‌తో రొమాన్స్.. భావోద్వేగాలు, భావప్రాస్తి కూడా సాధ్యమేనట..
X

దిశ, ఫీచర్స్ : డిజిసెక్సువాలిటీ అనే మాట ఎప్పుడైనా విన్నారా? 2017లో నీల్ మెక్‌ ఆర్థర్, మార్కీ ఎల్‌సి అనే ఇద్దరు పరిశోధకులు మొదటిసారిగా ఈ పదాన్ని పరిచయం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం మానవులు తమ నిజమైన లైంగిక భాగస్వామితో కాకుండా ఒక సాంకేతిక భాగస్వామితో లైంగిక అవసరాలను తీసుకోవచ్చని, ప్రేమలో పడవచ్చని భవిష్యత్తులో ఇది జరిగి తీరుతుందని వారు అంచనా వేశారు. ప్రస్తుతం ఆ అంచనాలు నిజం అవుతున్నాయి. ఎలాగంటే ఇప్పటికే మానవ జీవితాల్లోకి సెక్స్‌టాయ్స్ లేదా డాల్స్ ప్రవేశించాయి. ఒక వ్యక్తి అపోజిట్ సెక్స్ పర్సన్ లేకపోయినా లైంగిక సంతృప్తిని పొందగలుగుతున్నారు.

రొమాన్స్ విషయంలో మనుషుల మధ్య ఉండే భావోద్వేగాలతో ముడిపడిన ఫీల్ ఆఫ్ లవ్ సెక్స్ టాయ్స్ వల్ల పూర్తిస్థాయిలో కలుగకపోవచ్చు. కానీ లైంగిక సంతృప్తిని పొందడంలో మాత్రం సహాయపడుతున్నాయి. అయితే భవిష్యత్తులో అచ్చం ఒక స్త్రీ, పురుషుడు సెక్స్‌లో పాల్గొనప్పుడు వారిలో కలిగే అనుభూతి మాదరిగానే, ఒక మనిషి, ఒక రోబో మధ్య కూడా లైంగిక చర్య జరిగినప్పుడు కూడా అదే ఫీల్‌ అండ్ లవ్ కలిగే రోబోట్స్ అందుబాటులోకి రానున్నాయని పరిశోధకులు చెప్తున్నారు. దీనినే డిజి సెక్సువాలిటీ అంటున్నారు.

2050 నాటికి జరిగేది ఇదే..

మిలీనియల్స్‌లో 25% మంది భవిష్యత్తులో రోబోలతో స్ట్రాంగ్ ఫ్రెండ్‌షిప్ లేదా సెక్సువల్ రిలేషన్‌షిప్స్ కలిగి ఉండటం కామన్ అయిపోతుందని నమ్ముతున్నట్లు ఇటీవలి ఒక సర్వేలో వెల్లడైంది. 2025 నాటికి ఉన్నత ఆదాయ కుటుంబాలు ఇంట్లో సెక్స్‌బాట్‌లను కలిగి ఉంటారని ఫ్యూచరాలజిస్ట్ ఇయాన్ పియర్సన్ పేర్కొన్నాడు. ఇక 2050 నాటికి మనుషుల కంటే రోబోలతో క్లోజ్ రిలేషన్‌షిప్ కలిగి ఉండే మనుషుల సంఖ్య పెరగనుందని, ఏఐ అండ్ మెకానికల్ బిహేవియర్స్ రోబోట్స్ ఫీల్ ఇంప్రూవ్ చేస్తాయి కాబట్టి అవి బలమైన భావోద్వేగ బంధాలతో స్నేహం చేయడం ప్రారంభిస్తాయని కూడా వెల్లడించాడు.

సెక్స్ రోబోల పరిణామం

కొన్ని సంవత్సరాల క్రితం సెక్స్ రోబోట్స్ గురించి ఎవరినైనా అడిగితే ఆశ్చర్యపోయేవారు. కానీ ఇప్పుడు ముసి ముసి నవ్వుతారు. సెక్స్ రోబోట్ ద్వారా కోరిక తీర్చుకోవడంలో తప్పేముంది అనేవారు లేకపోలేదు. ఎందుకంటే అవి అచ్చం మానవులను పోలి ఉంటున్నాయి. ముఖ్యంగా లైంగిక సంబంధంలో స్పర్శ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒక రోబో మనిషి మాదిరిగానే ఎదుటి వ్యక్తిలో లైంగిక ప్రేరణ కోసం స్పర్శను కలిగించడం ప్రస్తుతం సాధ్యమే. కాకపోతే ఇది పాక్షిక మానవ లక్షణంగా ఉంది. మరింత ఎఫెక్టివ్‌గా ఫీల్ ఆఫ్ లవ్‌తో మనిషి మాదిరిగానే భావోద్వేగాలను అనుభవిస్తూ, కదలికల రూపంలో వ్యక్తపరుస్తూ లైంగిక చర్య జరిపే రోబోల రూపకల్పనలో భాగంగా శాస్త్రవేత్తలు టెంపరేచర్ సెల్ఫ్ రెగ్యులేషన్‌ సృష్టికి ప్రయోగాలు చేస్తున్నారు.

భావోద్వేగాలు, భావప్రాప్తి కూడా..

మానవుల మాదరి జననేంద్రియాలను కలిగి ఉండే రోబోట్స్‌ను క్రియేట్ చేస్తున్నారు పరిశోధకులు. అంటే ఒక మనిషి ఆ రోబోట్‌ జననేంద్రియాన్ని తాకితే కూడా అది మనిషిలాగే ఫీల్ అవుతుంది. లైంగిక చర్య ద్వారా భావ ప్రాప్తి కలిగినప్పటి అనుభూతిని చెందుతుంది. అందుకోసం టచ్‌ యూ అనే సంస్థ ‘స్మార్ట్ స్కిన్’ని డెవలప్ చేసింది. ఇది ‘సహజమైన’ మార్గంలో మానవ పరస్పర చర్యకు ప్రతిస్పందించే సెన్సార్‌ను కలిగి ఉంది. మానవులను అనుకరించే ప్రయత్నంలో రోబోలు ఇప్పుడు ప్రోగ్రామ్ చేయబడిన వ్యక్తిత్వ లక్షణాలు, మనోభావాలతో వస్తున్నాయని సెక్స్‌బాట్ మానుఫక్చరింగ్ కంపెనీ అయిన అబిస్ క్రియేషన్స్ సీఈఓ మాట్ మెక్‌ ముల్లెన్ అని అంటున్నారు. ‘‘మానవ లైంగిక భాగస్వాములకు ప్రత్యామ్నాయంగా టెక్నాలజీ వాడాలనేది మా ఉద్దేశం కాదు. కాకపోతే భాగస్వామిని కోల్పోయిన వారికి సెక్స్ రోబోట్స్ ఒక పరిష్కారంగా ఉంటాయి’’ అని ట్రూ కంపానియన్ సీఈఓ డగ్లస్ హైన్స్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed