Health: స్కిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గట్లేదా..? షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేవేమో!

by Javid Pasha |
Health: స్కిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గట్లేదా..? షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేవేమో!
X

దిశ, ఫీచర్స్ : స్కిన్ అలర్జీలు, ఇన్‌ఫెక్షన్స్‌తో ఇబ్బంది పడుతున్నారా..? ఎంతకీ తగ్గట్లేదా? ఎంతకైనా మాంచిది ఓసారి షుగర్ వెవెల్స్ చెక్ చేసుకోండి! ఎందుకంటే రక్తంలో చక్కెరస్థాయిలు అధికంగా ఉన్నప్పుడు కూడా బాధితులు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ బాధితుల్లో ఈ సమస్య అధికంగా ఉండే అవకాశం ఉంది. చర్మంపై తెల్లటి పొలుసులు ఏర్పడటం, దురద కారణంగా చర్మం ఎర్రగా మారడం, పొడిబారడం, చర్మంపై గాయాలు మానకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

నిజానికి రక్తంలో షుగర్ లెవెల్స్ యూరిన్‌ను క్రియేట్ చేసే క్రమంలో స్కిన్ సెల్స్ నుంచి లిక్విడ్‌ను తీసే ప్రక్రియలోనూ శరీరానికి సహకరిస్తాయని నిపుణులు అంటున్నారు. ఇక్కడ లోపం ఏర్పడటంవల్లే స్కిన్ పొడిబారడం లేదా పగుళ్లు ఏర్పడటం వంటివి సంభవిస్తాయి. దీంతోపాటు వివిధ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా మధుమేహం ఉన్నవారికి త్వరగా సోకే చాన్స్ ఉంటుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ పేర్కొంటున్నారు. దీంతో కాలి వేళ్ల మధ్య, మోచేయి మడతల భాగంలో, చంకల్లో, గొంతు కింద, నోటి దగ్గరగా దద్దుర్లు, పొలుసులు వంటివి కనిపిస్తే జాగ్రత్త పడాలి. ఫంగల్ ఇన్ఫెక్షన్ల కారణంగానూ ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ పేషెంట్లలో తలెత్తే చర్మ సమస్యలు చాలా వరకు చక్కెరస్థాయిల్లో మార్పులతో ముడిపడి ఉంటాయి. కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ‌’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement
Next Story

Most Viewed