డోలో 650' తో ప్రాణాంతకమైన సైడ్ ఎఫెక్ట్స్

by Disha News Desk |
డోలో 650 తో ప్రాణాంతకమైన సైడ్ ఎఫెక్ట్స్
X

దిశ, ఫీచర్స్ : కోవిడ్ కారణంగా ప్రపంచం మొత్తం తలకిందులైంది. రెండేళ్లలో కరోనా వైరస్ మిలియన్ ప్రాణాలను బలితీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతుండగా.. దగ్గు, జ్వరం, తలనొప్పి, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ వంటి లక్షణాలు కనబడుతున్నాయి. ఈ క్రమంలో అన్నిటికీ ఒకటే ఆయుధం అన్నట్లుగా.. సింప్టమ్స్ కనిపించిన వెంటనే చాలా మంది Dolo-650 మింగేస్తున్నారు.

దీనివల్ల ప్రస్తుతమున్న లక్షణాలు తగ్గడంతో పాటు ఇతరత్రా బాడీ పెయిన్స్‌కు కూడా పరిష్కారం లభిస్తోంది. ఈ నేపథ్యంలో డాక్టర్ సలహా తీసుకోకుండా ప్రతీసారి ఇదే టాబ్లెట్ యూజ్ చేస్తున్నారు. దీనివల్ల ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినా.. ఫ్యూచర్‌లో మాత్రం సైడ్ ఎఫెక్స్‌తో ప్రాణాంతక సమస్యలు తలెత్తే చాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

కామన్ సైడ్ ఎఫెక్ట్స్

వికారం, లో బ్లడ్ ప్రెషర్, తలతిరగడం, బలహీనంగా అనిపించడం, అతినిద్ర, మలబద్దకం, నోరు ఎండిపోవడం

సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్

స్లో హార్ట్ బీట్, గొంతు వాపు, ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్, నాడీ వ్యవస్థపై ఎఫెక్ట్ వల్ల హార్ట్ బీట్ పెరిగే చాన్స్.

Advertisement

Next Story

Most Viewed