డబ్బు ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకున్నా.. ఆ కోరిక తీరట్లేదంట

by samatah |
డబ్బు ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకున్నా.. ఆ కోరిక తీరట్లేదంట
X

దిశ, వెబ్‌డెస్క్ : రిలేషన్ షిప్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి పని లేదు.ఇక పెళ్లి అంటే చాలు, ఎన్నో విషయాల గురించి ప్రత్యేకంగా ఆలోచిస్తుంటారు.ముఖ్యంగా చేసుకోబోయే అతనికి ఆస్తి ఉందా లేదా అని ఎక్కువ ఆలోచిస్తుంటారు. అయితే ఆస్తి ఉందని ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్న మహిళ చివరకు తన బాధను వ్యక్తపరుస్తూ ఇలా అంటుంది.

ఆమె ఫీలింగ్ ఏమిటో తెలుసుకోండి. నేను చాలా బాగా ఆస్తి ఉందని చూసి, పెళ్లి చేసుకున్నా, చాలా లగ్జరీగా బతుకుతా అనుకున్నా, కానీ నేను అనుకున్న జీవితానికి అంతా రివర్స్ జరిగింది. నా భర్త చాలానే సంపాదిస్తున్నాడు. కానీ మా ఇంటి ఖర్చులన్నీ నా భర్తే భరిస్తున్నాడు. నేను కొంత సంపాదిస్తున్నా.. మళ్లీ నా భర్తపైనే ఆర్థిక భారం వేస్తున్న.

నేను అనుకున్న జీవితం నాకు లేదు. నేను రోజు రోజుకు డబ్బు పోగు చేసుకోవాల్సి వస్తుంది. మేము పెళ్ళి చేసుకునే ముందు నా భర్త, నేను అగ్రిమెంట్ చేసుకున్నాం. డబ్బు విషయంలో తనకి ఎలాంటి కలిగించనని.. అయితే, అదే నా కొంప ముంచిది. మ్యారేజ్ అయ్యాక తను పూర్తిగా మారిపోయాడు. ముందులా ఖర్చుపెట్టినట్లుగా కూడా నా గురించి ఖర్చు చేయట్లేదు. నాకు ఎలాంటి విషయంలోనూ సాయం అందించట్లేదు. తన ఫ్యామిలీకే ఉన్న మనీని ఖర్చు చేస్తున్నాడు. నాకు వారికి పెట్టకూడదని కాదు. నా గురించి కూడా ఆలోచించట్లేదు. ఏమైనా అంటే అగ్రీమెంట్ అంటున్నాడు. దీంతో నాకు చిన్న చిన్న కోరికలు తీర్చుకోవాలనే కల కూడా కలలానే ఉంటోంది. ఇది మీకు చెప్పుకుంటే నాకు కాస్తా ఓదార్పు ఉంటుందనిపించి చెబుతున్నా. అంటూ ఓ మహిళ తన బాధను ఇలా వ్యక్త పరిచింది.​

Advertisement

Next Story

Most Viewed