- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
New study : వారానికి రెండుసార్లు ఇవి తింటే.. ఆ రిస్క్ ఉండదంటున్న నిపుణులు!

దిశ, ఫీచర్స్ : ఉడకబెట్టిన కోడి గుట్లు (Eggs) తినడం ఆరోగ్యానికి మంచిదనే విషయం మనకు తెలిసిందే. ఎందుకంటే వీటిలో శరీరానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఒక సాధారణ గుడ్డులో సుమారు 50 గ్రాముల వరకు పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. అంతేకాకుండా ప్రొటీన్లు, విటమిన్లు, ఆమైనో యాసిడ్స్కు మూలం కాబట్టి గుడ్లు తింటే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే తాజా పరిశోధన మరో కొత్త విషయాన్ని కూడా వెల్లడించింది. వారానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ గుడ్లు తినడంవల్ల అల్జీమర్స్(Alzheimer's) డెమెన్షియా (dementia) వంటివి వచ్చే రిస్క్ 47% శాతం తగ్గుతుందని పేర్కొన్నది.
పరిశోధన జరిగిందిలా?
రష్ మెమరీ అండ్ ఏజింగ్ ప్రాజెక్ట్ (Rush Memory and Aging Project)లో భాగంగా ఇటీవల జరిగిన ఒక పరిశోధనలో రీసెర్చర్స్ గుడ్లు తినడం ఆరోగ్యంపై కలిగించే ప్రభావాలను స్టడీ చేశారు. ఇందులో భాగంగా వారు 1,024 మంది వృద్ధుల(Average age 81.4 years)ను పరిశీలించారు. వీరిలో 280 మంది అల్జీమర్స్ డిమెన్షియా (Alzheimer's dementia) కలిగి ఉన్నారు. అలా 6 సంవత్సరాలకు పరిశోధనలు నిర్వహించిన నిపుణులు. గుడ్లు తినేవారి, తినని వారి ఆరోగ్య డేటాను ట్రాక్ చేశారు. అయితే ఈ సందర్భంగా వారు అప్పటికే డిమెన్షియాతో బాధపడుతున్నవారిలో వారినికి రెండుసార్లు గుడ్లు తినడంవల్ల డిమెన్షియా రిస్క్ 47% శాతం తగ్గినట్లు నిర్ధారణకు వచ్చారు.
ప్రయోజనాలివే..
గుడ్డు తినడంవల్ల మతిమరుపు, డిమెన్షియా వంటివి ఎందుకు తగ్గుతాయిన విశ్లేషించిన పరిశోధకులు వీటిలోని కొన్ని ముఖ్యమైన పోషకాలే అందుకు కారణమని కనుగొన్నారు. ముఖ్యంగా గుడ్డు సొనలో ఉండే కోలిన్ పోషకం జ్ఞాపక శక్తిని, మెదడు సామర్థ్యాన్ని పెంచుతుందని, డిమెన్షియా రిస్క్ను తగ్గిస్తుందని గుర్తించారు. ఒక గుడ్లలోను కొన్ని రకాలు ఉంటాయి. సైజులు కూడా కొద్దిమొత్తంలో తేడా ఉంటాయి. బాతు గుడ్లు, కోడిగుడ్లు, నెమలి గుడ్లు ఇలా.. రకరకాలవి కూడా ఉంటాయి. కాగా ఒక పెద్ద గుడ్డులో 150 మిల్లీ గ్రాముల కోలిన్ ఉంటుందని, ఇది రోజువారీ సిఫార్సు మోతాదులో 25% కోలిన్ (Colin)ను శరీరానికి అందిస్తుందని తెలిపారు. అట్లనే న్యూరో ట్రాన్స్మిటర్గా పనిచేసే అసిటైల్ కోలిన్ (Acetylcholine) ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. దీంతోపాటు గుడ్లలో ఒమెగా -3 ఫ్యాటీ యాసిడ్స్ (DHA), లుటీన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మెదడు వాపును, ఆక్సిడేటివ్ స్ట్రెస్ను నివారించడం ద్వారా డిమెన్షియాను నివారిస్తాయి.
READ MORE ...
Garlic : రోజుకు 2 పచ్చివెల్లుల్లి రెబ్బలు తింటే .. ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..!