- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Health Tips: రోజూ ఒక దానిమ్మ పండు తింటే.. ఆరోగ్యానికి ఢోకాలేదు
దిశ, ఫీచర్స్: ఆకు పచ్చని కొమ్మల మధ్య వేలాడుతూ కనిపించే ఆ ఎర్రటి లేదా ఎరుపు లైట్ ఎల్లో కలర్ మిక్స్ అయిన పండు మనల్ని ఎంతగానో ఆకర్షిస్తుంది. చూడగానే తీసుకెళ్లి తినేయాలనిపిస్తుంది. అంతేకాదు అది ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆహార నిపుణులు చెప్తున్నారు. అదేం పండూ.. అని ఆలోచిస్తున్నారా? మరేదో కాదు, తరచూ ఎక్కడో ఒకచోట మన కళ్లకు దర్శనమిచ్చే దానిమ్మ పండు. ఇది తినడం 'వెరీహెల్తీ' అంటున్నారు డైటీషియన్లు.
శక్తినిచ్చే పోషకాలు, ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లవేనాయిడ్లు దానిమ్మలో పుష్కలంగా ఉంటాయట. ప్రతిరోజూ ఒక దానిమ్మపండు తినడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలో రక్త ప్రసరణను మెరుగు పరిచి, జబ్బులు రాకుండా నివారించడంలో మేటి దానిమ్మ. అంతేకాదు కండరాలు, నరాలను ఆరోగ్యంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఈ పండులో పాలీ ఫెనాల్స్ అనే పోషకం వృద్ధాప్య ఛాయను దూరం చేస్తుంది. దానిమ్మ విత్తనాలు ఎరుపు రంగు కలిగి తియ్యటి పుల్లటి రుచి మిక్స్ అయి ఉంటాయి. ఒక దానిమ్మ పండులో 83 కిలో కేలరీలు, 13 గ్రాముల చక్కెర, ఫైబర్ ఉంటుందట. దీంతోపాటు ఫోలేట్, పొటాషియం, విటమిన్ కె ఉంటాయి కాబట్టి, ఏ విధంగా చూసినా దానిమ్మ అందరూ తినదగిన ఆరోగ్యఫలం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
- Tags
- Pomegranate