- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోజంతా కదలకుండా కూర్చుంటున్నారా?.. 16 % డెత్ రిస్క్ పెరిగినట్లే..
దిశ, ఫీచర్స్ : పగటిపూట ఒకే దగ్గర కూర్చోకుండా తమ తమ పనుల్లో యాక్టివ్‌గా ఉండే వ్యక్తులతో పోలిస్తే, ఎక్కువ సమయం ఒకేదగ్గర కూర్చొని వర్క్ చేసే వ్యక్తుల్లో డెత్ రిస్క్ 16% పెరిగే అవకాశం ఉందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. పైగా ఇటువంటి జీవనశైలిని కలిగి ఉండేవారి మరణాల్లో 34 శాతం మరణాలు గుండె జబ్బులవల్ల సంభవించే చాన్స్ వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు చెప్తున్నారు. కాగా ఇటువంటి ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే పనిలో భాగంగా ఒక రోజులో ఎక్కువ సమయం ఒకే దగ్గర కూర్చునే వ్యక్తులు, అలా కూర్చోకుండా ఉండే వ్యక్తుల స్థాయికి తమ డెత్ రిస్కును తగ్గించడానికి, డైలీ 15 నుంచి 30 నిమిషాలు అదనంగా ఫిజికల్ యాక్టివిటీస్ కలిగి ఉండాలని సూచిస్తున్నారు.
అధ్యయనంలో భాగంగా పరిశోధకులు తైవాన్‌లో 1996 నుంచి 2017 వరకు సుమారు 4,82,000 మంది వ్యక్తుల ద్వైవార్షిక (Taiwan from) హెల్త్ చెకప్స్ డేటాను ఎనలైజ్ చేశారు. వారు పనిలో ఎంత సేపు కూర్చుంటున్నారు? అలాగే స్మోకింగ్, డ్రింకింగ్, ఎక్సర్‌సైజ్ లెవల్స్ లైఫ్ స్టై్ల్ ఎలా ఉన్నాయో అనేది కూడా అంచనా వేశారు. ఇక వర్క్ పర్పస్ కోసం ఎక్కువ సేపు కూర్చునే వారిలో 60% మందిని, ప్రత్యామ్నాయంగా, అంటే.. మధ్య మధ్యలో బ్రేక్ ఇవ్వడం వంటి పద్ధతుల్లో కూర్చొని ఉండే వారిలో 29% మందిని, అలాగే ఎక్కువగా కూర్చునే అవసరంలేని వారిలో 10% మందిని రీసెర్చర్స్ మూడు గ్రూపులుగా విభజించి అబ్జర్వ్ చేశారు. ఈ సందర్భంగా వారు గ్యాప్ లేకుండా రోజులో ఎక్కువ సమయం ఒకేచోట కూర్చొని పనిచేసే వారిలో డెత్ రిస్క్ 16 శాతం, హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ రిస్క్ 34 శాతం పెరుగుతున్నట్లు గుర్తించారు.