- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రతిరోజూ పాలు తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి?
దిశ, ఫీచర్స్: కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉండే పాలు తాగితే బోలెడన్నీ లాభాలున్నాయి. శారీరక ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రోజూ పాలు తాగడం వల్ల బోన్స్, కీళ్ళు బలంగా, దృఢంగా అవుతాయి. పాలు ఒక అద్భుతమైన శాఖాహార ప్రోటీన్ మూలంగా పరిగణిస్తాం. పాలలో ఉండే విటమిన్ డి మెదడును చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. ప్రతి రోజూ పాలు తాగితే టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించే అవకాశాలున్నాయని కీలక అధ్యయనంలో వెల్లడైంది. అలాగే షుగర్ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
స్ట్రోక్, గుండె జబ్బులు, అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. దీనికి కారణం ఇందులో ఉండే పొటాషియమే. పాల ఉత్పత్తులు వాటి అధిక సంతృప్త కొవ్వు పదార్థాల కారణంగా స్ట్రోక్ ప్రమాదాన్ని ఎక్కువగా కలిగి ఉంటాయి. పలు అధ్యయనాల ప్రకారం.. ప్రతి రోజూ పాలు తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదం నుంచి తప్పించుకోగలం. పెద్దప్రేగు, మల క్యాన్సర్ వంటివి దరిచేరవు. ఎందుకంటే కాల్షియం రసాయన లక్షణాలను కలిగి ఉంటుంది. బరువు తగ్గించడంలో కూడా పాలు ఎంతో మేలు చేస్తాయి. పాలలో ఉండే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు , కొవ్వుల కలయిక వల్లనే ఇలా జరుగుతుందని, దీని వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగని రోజూ ఎక్కువగా పాలు తాగినట్లైతే ప్రమాదంలో పడతారు. లిమిట్‌లో పాలు తాగాలి.