- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Doomscrolling : ఫోన్‌లో అలాంటి విషయాలే వెతుకుతున్నారా..? ఈ సమస్యలు తలెత్తే చాన్స్!
దిశ, ఫీచర్స్ : ఈ రోజుల్లో చాలా మంది ఒకపూట తినకుండా అయినా ఉండగలరేమో కానీ.. మొబైల్ ఫోన్ చెక్ చేయకుండా మాత్రం ఉండలేరు. రోజువారీ జీవితంలో అదో భాగమైపోయింది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ కలగలసిన సమాచార సర్వస్వమే మొబైల్ ఫోన్. ఏమాత్రం ఖాళీ దొరికినా అందులో లీనమైపోతుంటారు. పర్సనల్ వర్క్ అనో, ఆఫీస్ బాధ్యతలనో, టైంపాస్ అనో ఇంటర్నెట్‌లో మునిగిపోతుంటారు. అయితే ఇక్కడే చాలామంది చిక్కుకుపోతున్నారని నిపుణులు చెప్తున్నారు. అదెలాగో చూద్దాం.
*ఏదో సమాచారం కోసమంటూ సెర్చింగ్ మొదలు పెట్టి.. క్రమంగా సోషల్ మీడియాతో పాటు ఇంకెన్నో వెబ్‌సైట్స్‌లోకి అనుకోకుండా ప్రవేశిస్తుంటారు పలువురు. అంటే అవసరమైన సమాచారంతోపాటు అవసరంలేని విషయాలు కంటపడినా వాటిని వదలకుండా వెతుకుతూనే ఉంటారు. దీనినే ‘డూమ్ స్ర్క్రోలింగ్’ (Doomscrolling) అంటున్నారు నిపుణులు. చాలామందిలో ఇదొక వ్యసనంగా మారుతోందని, పలు సమస్యలకు దారితీస్తోందని నిపుణులు చెప్తున్నారు.
*స్మార్ట్‌ఫోన్‌లో విషాదకరమైన సంఘటనలు (Tragic events), నేరాలు, హింస, మనసుకు బాధ కలిగించే సమాచారం కంటపడినప్పుడు చాలా మంది చదవకుండా ఉండలేరు. అయితే సెర్చింగ్ వ్యసనంగా మారిన ‘డూమ్ స్ర్క్రోలింగ్’ బాధితులు అంతటితో దానిని వదిలేయరు. అలాంటి విషాదాలు, బాధలు తమకు కూడా సంభవిస్తాయేమోనని ఆలోచిస్తుంటారు. క్రమంగా ఇదొక ఆందోళనగా మారుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
* సెర్చింగ్ సమయంలో బాధాకర సంఘటనలకు సంబంధించిన వార్తలు పలువురిలో చికాకును కలిగిస్తాయి. వాటి గురించి మరింత లోతుగా అన్వేషిస్తున్నప్పుడు కోపం, టెన్షన్ (Anger, tension) వంటివి పెరిగిపోతాయి. ఈ పరిస్థితి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు అంటున్నారు నిపుణులు. ఇక అప్పటికే మెంటల్ ఇష్యూస్‌తో బాధపడేవారు భయంకరమైన లేదా ఆందోళన కలిగించే సమాచారం చదివినప్పుడు, వీడియోలు చూసినప్పుడు మరింత టెన్షన్‌కు గురవుతారు. దీనివల్ల ఉన్నట్లుండి చెమటలు పట్టడం, గుండె దడ పెరగడం, శ్వాసలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్‌పై నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతుంది.
* ఇంకొంతమంది నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్ చూస్తుంటారు. క్రమంగా ‘డూమ్ స్క్రోలింగ్’ వ్యసనం బారిన పడితే గనుక ఈ సమయంలో కూడా విషాద వార్తలను వెతుకుతుంటారు. దీంతో నిద్రకు భంగం కలుగుతుంది. మరోవైపు ఆందళన, ఒత్తిడి (stress) పెరుగుతాయి. హార్మోన్ల విడుదలలో హెచ్చు తగ్గులు సంభవిస్తాయి. దీనివల్ల ఆరోగ్యం పాడవుతుంది.
‘డూమ్ స్క్రోలింగ్’ వ్యసనంగా మారి మానసిక, శారీరక అనారోగ్యానికి దారితీస్తుంది. కాబట్టి సమస్య నుంచి బయపడాల్సిన అవసరం ఉందంటున్నారు మానసిక నిపుణులు. అందుకోసం సెర్చింగ్ చేసేవారు అవసరంలేకపోయినా మొబైల్ ఫోన్‌లో మునిగిపోవడం, మానసికంగా కృంగదీసే సమాచారాన్ని వెతకడం వంటివి ఎక్కువ చేయకూడదు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా రాత్రిళ్లు నిద్రపోయే ముందు ఫోన్ చూసే అలవాటును దూరం చేసుకోవడంవల్ల ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. పగటిపూట కూడా అవసరం లేకున్నా ఫోన్ చూస్తూ ‘డూమ్ స్క్రోలింగ్’ వ్యసనానికి గురయ్యే అవకాశం ఉంటే, ప్రత్యామ్నాయంగా ప్రృతిలో గడపడం, ఫ్యామిలీ, పిల్లలు, స్నేహితులతో టైమ్ స్పెండ్ చేయడం మీకు మేలు చేస్తుంది.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.