- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
వీర్యం కావలెను.. ఆ ఏజ్ పురుషులకే ప్రయారిటీ
దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో సంతానలేమి సమస్యలను ఎదుర్కొంటున్న చాలా మంది డోనర్ల నుంచి సేకరించిన స్పెర్మ్ ద్వారా పిల్లల్ని కనడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగా స్పెర్మ్ డొనోర్లకు, ఫెర్టిలైజేషన్ నిపుణులకు ప్రాధాన్యత పెరిగిపోతోంది. ప్రాసెస్ మొదలు ప్రయోజనాల వరకు ఈ ప్రక్రియ నొప్పిలేనిదిగా, సురక్షితమైదిగా ఉంటుందంటున్న నిపుణులు.. మార్గదర్శకాలను అనుసరిస్తే అటు డోనర్‌కు ఇటు టేకర్స్‌కు ఎటువంటి సమస్యలు తలెత్తవని భరోసా ఇస్తున్నారు. అయితే స్పెర్మ్ డొనేషన్ గురించి చాలామంది ఓపెన్‌గా మాట్లాడలేక పోతున్నారు. కానీ దీన్ని ఆసక్తితోపాటు అవగాహన కలిగి ఉండాల్సిన అంశంగా పరిగణించాలంటున్న ఎక్స్‌పర్ట్స్.. సహజంగా సంతానం కలిగే ఆప్షన్స్ లేనప్పుడు ఈ పద్ధతి బెటర్ అని సూచిస్తున్నారు.
స్పెర్మ్ డొనేషన్ ప్రాసెస్ ప్రకారం.. ఒక వ్యక్తి హస్త ప్రయోగం ద్వారా స్కలించిన వీర్యాన్ని స్పెర్మ్ బ్యాంకులకు లేదా అవసరమైన సంస్థలకు అందించవచ్చు. ఫెర్టిలైజేషన్ నిపుణులు ఈ వీర్యకణాలను ల్యాబోరేటరీలోని ప్రత్యేక వాతావరణంలో నిల్వ చేస్తారు. అవసరమైనప్పుడు స్త్రీ గర్భాశయంలోని పునరుత్పత్తి అవయవాలలో ఫలదీకరణం చేస్తారు. ల్యాబ్‌లో పరిపక్వమైన ఎగ్స్ ఫెర్టిలైజేషన్ కోసం శరీరం వెలుపల కూడా ఈ టెక్నాలజీ ద్వారా ఉపయోగించవచ్చు. ఈ ప్రక్రియను ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్(IVF) అంటారు.
ఏ వయస్సులో బెటర్?
స్పెర్మ్ డోనర్ అంటే.. గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్న స్త్రీకి లేదా జంటకు వీర్యాన్ని దానం చేసే వ్యక్తి. నిబంధనల ప్రకారం ఒంటరి వ్యక్తులు, కపుల్స్, స్వలింగ జంటలు దాతల నుంచి స్పెర్మ్ పొందవచ్చు. రిజిస్టర్డ్ ART (అసిస్టెడ్ రీ ప్రొడెక్టివ్ టెక్నాలజీ) బ్యాంకులు 21 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు గల పురుషుల వీర్యాన్ని పరీక్షించవచ్చు. సేకరించవచ్చు. నిల్వ చేయవచ్చు. అయినప్పటికీ చాలా స్పెర్మ్ బ్యాంకులు 18 నుంచి 39 సంవత్సరాల మధ్య వయస్సు గల దాతల నుంచి స్పెర్మ్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తుంటాయి.
సెమెన్ సేకరించే ముందు డోనర్‌కు సంబంధించిన మెడికల్, ఫ్యామిలీ హిస్టరీని విశ్లేషిస్తారు. ప్రత్యేకించి జన్యుపరమైన లేదా వంశపారంపర్య రుగ్మతలేమైనా ఉన్నాయా? లేదా అని నిర్ధారించుకుంటారు. ఫిజికల్ ఎగ్జామినేషన్‌లో గతంలో జరిగిన సర్జరీలు, అలర్జీలు, మద్యం, ధూమపానం వంటి అలవాట్ల గురించి తెలుసుకుంటారు. గుండె సంబంధిత సమస్యలు, డయాబెటిస్ లేదా ఇతర ఏవైన ఆరోగ్య సమస్యలకు సంబంధించిన పర్సనల్ హిస్టరీని గమనిస్తారు. హెచ్ఐవి సిఫిలిస్,హెపటైటిస్ వంటి లైంగికపరంగా సంక్రమించే వ్యాధులను నిర్ధారించడానికి బ్లడ్ టెస్టులు చేస్తారు.
అఫిషియల్ డోనర్ అర్హతలు
అఫిషియల్ స్పెర్మ్ డోనర్‌గా ఒక వ్యక్తిని గుర్తించడానికి ముందు.. సదరు వ్యక్తి స్పెర్మ్ క్వాలిటీ, క్వాంటిటీ, మొటిలిటీ టెస్టును డాక్టర్లు సజెస్టె చేస్తారు. ఇందుకు సంబంధించిన డోనర్ స్పెర్మ్ శాంపిల్ ఇవ్వాలి. ఫెర్టిలిటీ క్రైటీరియా ప్రకారం.. ఒక మిల్లీ లీటర్ స్పెర్మ్‌కు 15 మిలియన్ల కంటే ఎక్కువ స్పెర్మ్ కౌంట్ ఉండాలి. అంతేకాదు స్పెర్మ్ నార్మల్ స్ట్రక్చర్, తగిన షేప్‌ను కలిగి ఉండాలి. 40 శాతం కంటే ఎక్కువ స్పెర్మ్‌లు మొటిలిటీని కలిగి ఉండాలి. అలాగే వ్యక్తి అభిరుచులు, స్టడీ, పర్సనల్ హాబీస్, ఇంట్రెస్ట్స్ గురించిన ఇన్ఫర్మేషన్‌ను షేర్ చేసుకోవాలని నిపుణులు అడుగుతారు.
కొన్ని ఆడియో, వీడియో రికార్డింగ్‌లను ఇవ్వమని కూడా కోరవచ్చు. స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వ్యక్తి, క్రైటీరియాను ఫుల్‌ఫిల్ చేసి సమ్మతి పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది. స్పెర్మ్ డోనర్ మానసిక, భావోద్వేగ, చట్టపరమైన అంశాలు, సమస్యల గురించి ముందుగానే కౌన్సెలింగ్ పొందడం చాలా ముఖ్యం. ఇక దాతగా మారిన వ్యక్తి భవిష్యత్తులో జీవసంబంధమైన పిల్లలతో సంప్రదింపు సమాచారాన్ని పంచుకోవాలో లేదో కూడా ఎంచుకోవచ్చు.
చట్టాలేం చెప్తున్నాయి?
స్పెర్మ్ డొనేషన్ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) యాక్ట్-2021 ప్రకారం స్పెర్మ్ డొనేషన్ ప్రక్రియను కొనసాగించాలి. ప్రతి ART క్లినిక్, బ్యాంకు తప్పనిసరిగా నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ బ్యాంక్స్ అండ్ క్లినిక్ ఆఫ్ ఇండియా ద్వారా రిజిస్టర్ చేయబడి ఉండాలి. అటువంటి క్లినిక్స్, స్పెర్మ్ బ్యాంకుల రిజిస్ట్రేషన్ ఐదేళ్లపాటు చెల్లుబాటవుతుంది. మరో ఐదేళ్లపాటు రెన్యూవల్ చేసుకోవచ్చు. చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తే సదరు స్పెర్మ్ బ్యాంక్ పర్మిషన్‌ను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.
అందుకోసం వివరణాత్మక మార్గదర్శకాలు నిర్దేశించబడ్డాయి. ఉదాహరణకు ప్రీ-కాన్సెప్షన్, ప్రీ-నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ 1994 ప్రకారం క్లినిక్‌లు ముందుగా నిర్ణయించిన జెండర్ చైల్డ్(ఆడ/మగ)ను అందించడానికి పర్మిషన్ ఉండదు. ఫైనల్‌గా స్పెర్మ్ డోనర్, టేకర్స్ చట్టబద్ధమైన మార్గదర్శకాలను అనుసరిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు.