- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చేపలను వేటాడంలో డాల్ఫిన్స్, మనుషుల స్నేహ బంధం..
దిశ, ఫీచర్స్: ఆగ్నేయ బ్రెజిల్ మత్స్యకారులు డాల్ఫిన్స్‌తో 140 ఏళ్లకుపైగా అసాధారణ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. నిజానికి మురికిగా ఉన్న నీటిలో చేపలు కనబడవు. ఈ క్రమంలోనే డాల్ఫిన్స్ చేపలు పట్టేందుకు మానవులను ట్రైన్ చేస్తుంటాయి. ఎక్కడ నిలబడాలి, ఎప్పుడు వలలు విసరాలనే సూచనలను అందిస్తుంటాయి.
తోకను కొట్టడం, తలను పైకెత్తి లోతుగా డైవింగ్ చేయడం వంటి సైన్స్‌తో జాలర్లను అప్రమత్తం చేసి.. ఆ ప్రాంతంలో చేపలు ఉన్నాయని, వెంటనే వలలు విసరాలని హెచ్చరిస్తుంటాయి. చిన్న తీరప్రాంతమైన లగునలో పురుషులు అట్లాంటిక్ మహాసముద్రం నుంచి ఫిష్‌ను క్యాచ్ చేసేందుకు వీటిపై ఆధారపడటం చూస్తూనే ఉన్న పరిశోధకులు.. డాల్ఫిన్ అండ్ హ్యూమన్ ఫ్రెండ్‌షిప్‌పై అధ్యయనం నిర్వహించారు.
ఈ క్రమంలో ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన బృందం 177 మంది మత్స్యకారులను ఇంటర్వ్యూ చేశారు. బెస్ట్ డాల్ఫిన్ ఫిషింగ్ పార్ట్‌నర్ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారో తెలుసుకున్నారు. 2018 నుంచి 2019 వరకు దాదాపు 5000 ముల్లెట్ క్యాచ్‌లను రికార్డ్ చేసిన పరిశోధకులు.. మత్స్యకారుల క్యాచ్‌లలో ఎనభై ఆరు శాతం డాల్ఫిన్‌లతో 'సింక్రోనస్ ఇంటరాక్షన్' నుంచి వచ్చినట్లు తెలిపారు. అంటే డాల్ఫిన్ సమక్షంలో మానవులు చేపలు పట్టే అవకాశం 17 రెట్లు ఎక్కువ. ఈ స్నేహం ప్రపంచవ్యాప్తంగానూ కొనసాగుతుందని చెప్పుకొచ్చారు.