Relationship : మీ భార్య మీ దగ్గర ఏదైనా దాస్తున్నట్టు మీకు అనిపిస్తుందా?.. అయితే ఇలా తెలుసుకోండి!

by Prasanna |   ( Updated:2024-08-10 07:04:48.0  )
Relationship : మీ భార్య మీ దగ్గర ఏదైనా దాస్తున్నట్టు మీకు అనిపిస్తుందా?.. అయితే ఇలా తెలుసుకోండి!
X

దిశ, ఫీచర్స్: భార్య, భర్తల మధ్య వైవాహిక జీవితం చాలా ముఖ్యం. స్త్రీలలో కొందరు భర్తలతో సంతోషంగా ఉండరు. ఇక్కడే భర్తలు వారిని అర్ధం చేసుకోవాలి. భర్తలో లోపాలున్నా బయటకు చెప్పరు. దీని వలన ఇద్దరూ కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మహిళలు సాధారణంగానే తమ భర్తల దగ్గర చాలా విషయాలు దాస్తారు. అలాంటి సమయంలో భర్తలకు ఏమి అర్ధం కాదు. తెలియకుండా వారి మీద అనుమానం స్టార్ట్ అవుతుంది. మీ భార్య మీ దగ్గర ఎదో దాస్తున్నట్టు అనిపిస్తుందా.. ఈ సంకేతాలతో వాటిని గుర్తించండి. అవేంటో ఇక్కడ చూద్దాం..

నిముష నిముషానికి మీ భార్య ప్రవర్తనలో మార్పు వస్తుందంటే ఆమె ఖచ్చితంగా మీ దగ్గర ఎదో దాస్తున్నట్టు అర్ధం. అలాగే మీరు పక్కకు వెళ్ళగానే ఆమె వేరే రూమ్ లోకి వెళ్తున్న కూడా మీకు తెలియని విషయాలు ఏవో ఉన్నాయని అర్థం చేసుకోండి. మీ వైఫ్ కు ఫోన్ చేసినప్పుడల్లా బిజీ వస్తుంది మీరు ఇంటికి వెళ్ళగానే ఆమె ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసి పక్కకు పెడుతుంది. ఆమె ఏదో దాస్తోందని అర్థం చేసుకోవాలి. దాని కోసం మీరు ఎన్ని ప్రశ్నలు వేసినా ఆమె స్పందించకపోగా, ఆ సంభాషణను డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటుంది.

అలాగే, చీటికీ మాటికీ మీ మీద కోప పడుతూ ఉంటుంది. సమయం, సందర్భం లేకుండా ఆమె స్వభావం మారుతూ ఉంటుంది. ఇలా చేస్తుంటే ఆమె సీక్రెట్స్ మెయింటైన్ చేస్తుందని అర్ధం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed