- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆక్టోపస్‌ను మింగి అవస్థలు పడ్డ సింగపూర్ వ్యక్తి.. డాక్టర్లు ఏం చేశారంటే?
దిశ, ఫీచర్స్ : సింగపూర్‌కు చెందిన ఓ వ్యక్తి భోజనం తర్వాత అదే పనిగా వాంతులు చేసుకోవడం ప్రారంభించాడు. ఎంతసేపటికీ తగ్గకపోవడంతో తనకు ఏదో జరుగుతోందని ఆందోళన చెందాడు. నీళ్లు మింగడానికి కూడా తన వల్ల కాకపోవడంతో తన శరీరంలో ఏదో జరుగుతోందని భయపడ్డాడు. దీంతో హుటా హుటిన టాన్ టోక్ సెంగ్ హాస్పిటల్ ఎమర్జెన్సీ విభాగాన్ని సంప్రదించాడు. బాధితుడి ఇబ్బందిని గమనించిన అక్కడ డాక్టర్లు వెంటనే సిటిస్కాన్ తీయించారు. అయితే అన్నవాహికలో ఏదో పేరుకుపోయినట్లు గుర్తించినప్పటికీ వెంటనే అదేమిటో స్పష్టంగా తెలియలేదు. దీంతో మరోసారి గొంతులో నుంచి పొట్టలోకి ట్యూబ్ ద్వారా పంపించగలిగే సూక్ష్మమైన కెమెరాలను కలిగి ఉండే ఎసోఫాగో గ్యాస్ట్రో డ్యూడెనో స్కోపీ అనే ఇన్వాసిస్ ప్రక్రియను నిర్వహిస్తే అసలు విషయం బయట పడింది.
బాధితుడి అన్నవాహికలో ఆక్టోపస్ ఇరుక్కుపోయినట్లు గుర్తించిన డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆక్టోపస్ ఎలా చేరిందని ఆరా తీయగా, వాంతులు ప్రారంభం అయ్యేకంటే ముందు సదరు వ్యక్తి వండకుండానే పచ్చి ఆక్టోపస్‌తో భోజనం చేశాడట. అది ఇరుక్కుపోయిన కారణంగా బాధితుడు తీవ్రమైన వాంతులకు గురైనట్లు నిర్ధారించుకున్న డాక్టర్లు దానిని తొలగించి, రెండు రోజులపాటు తగిన ట్రీట్‌మెంట్ అందించాక, సదరు వ్యక్తి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అమెరికన్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ అసోసియేషన్ (AGA) ఇన్ స్టిట్యూట్ షేర్ చేసిన ఈ వార్త, ఎండోస్కోపిక్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకా నయం సదరు వ్యక్తి, బతికి ఉన్న సముద్ర జీవులను మింగలేదంటూ పలువురు సరదాగా కామెంట్ చేస్తున్నారు.
Read More: మరణం తర్వాత మనిషి తనతో ఒకే ఒక్కటి తీసుకెళతాడు: Chanakya Neeti