కొన్ని పదాలు నాలుక చివర వరకు వస్తాయి కానీ గుర్తుకు రావు.. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా?

by Jakkula Samataha |
కొన్ని పదాలు నాలుక చివర వరకు వస్తాయి కానీ గుర్తుకు రావు.. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : కొన్ని కొన్ని విషయాలు మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా మనం ఎవరితో అయినా మాట్లాడినప్పుడు, వారికి ఏదో చెప్దాం అనుకుంటాం, కానీ సడెన్‌గా అది మర్చిపోతుంటాం. ఇక వారికి అది మళ్లీ చెప్పడానికి తెగ ట్రై చేస్తాం దీంతో అది నాలుక చివరి వరకు వచ్చినట్లే అనిపిస్తుంది కానీ గుర్తుకు రాదు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా. చాలా మంది దీనిని జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్య అనుకుంటారు. కానీ ఇది దానికి సంబంధించినది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాగా, ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

కొంత మంది ఎవరి పేరు అయినా చెప్పడానికి లేదా తెలుసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే ఆ పేరు మన మదిలో మెదలాడుతున్నా, నోటికి మాత్రం రాదు, అలానే కొన్ని పదాలు కూడా గుర్తుకు రావు. దీంతో రోజు రోజుకు మతిమరుపు ఎక్కువ అవుతుంది అనుకుంటారు. కానీ, దీనికి అనేక కారణాలు ఉన్నాయంట. ముఖ్యంగా ఈ సమస్య వయసు పైబడిన వారిలో, వృద్ధుల్లో, కాలేజీ యువకుల్లో కనిపిస్తుంటుంది. ఇలాంటి పరిస్థితి చాలా సర్వసాధారణం. వృద్ధులు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడానికి వయసు, మతిమరుపు వంటి కారణంగా మర్చిపోతారు. ఇక యువకుల విషయానికి వస్తే వారు పెద్దగా పనులు చేయకపోవడం, ఎక్కువగా ఆలోచించే శక్తి లేకపోవడం వలన ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటారంట. అంతే కాకుండా కొంత మందికి పదాలు అర్థం కాకపోవడం, కొత్త పదమై ఉండటం వలన కూడా అవి గుర్తుకు రావు అంటున్నారు పరిశోధకులు. అయితే ఇలా మీకు ఎప్పుడైనా నాలుక చివరి వరకు పదాలు వచ్చి, ఆగిపోతే, దానికి సంబంధం ఉన్న దగ్గరి పదాలను వెతుక్కుంటూ పోవాలంట. దాని వలన మనం మర్చిపోయిన పదాలు గుర్తుకు వస్తాయి. అంతే కాకుండ ఇలాంటి పరిస్థితి ఎదురైన వారు ఎక్కువ ధ్యానం, వ్యాయామం చేయడం చాలా మంచిది అంటున్నారు నిపుణులు.

Advertisement

Next Story

Most Viewed