పెళ్లిలో మూడుముళ్లే ఎందుకు వేస్తారు..! శాస్త్రం ఏం చెబుతుందంటే..?

by sudharani |   ( Updated:2023-05-25 10:34:45.0  )
పెళ్లిలో మూడుముళ్లే ఎందుకు వేస్తారు..! శాస్త్రం ఏం చెబుతుందంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: అంగరంగా వైభవంగా చేసుకున్న పెళ్లిలో అయినా.. తూతూ మంత్రంగా జరిగే వివాహమైన మొడలో వేసేది మూడు ముళ్లే. ఇద్దరి వ్యక్తుల కలయికను.. రెండు కుటుంభాలకు బంధాలను కలిపై పవిత్రమైన పెళ్లి కేవలం మూడు ముళ్లతోనే ముడిపడి ఉంటుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ, అసలు మెడలో మూడు ముళ్లే ఎందుకు వేస్తారు..? దీని వెనుక ఏదైనా పరమార్థం దాగి ఉందా..? అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా! అవును ఈ మూడు ముళ్లు వెనుక ఓ పరమార్థం ఉంది. పెళ్లిలో మూడు ముళ్లు ఎందుకు వెయ్యాలి అనే దానిపై శాస్త్రాలు ఏం అంటున్నాయో తెలుసుకుందాం.

హిందూ సంప్రదాయంలో మూడు అనే సంఖ్య ఓ ప్రధానపాత్ర పోషిస్తుంది. త్రిలోకాలు, త్రిమూర్తులు, త్రిగుణాలు ఇలా మూడుతో ముడి పడి ఉంటాయి. అంతే కాదు.. మానవులకు స్థూల, సూక్ష్మ, కారణ అనే మూడు శరీరాలు ఉంటాయి. అంటే పెళ్లిలో వేసే ఒక్కో ముడి ఒక్కో శరీరానిది. వధూవరులు కేవలం బాహ్య శరీరంతో మాత్రమే కాకుండా మొత్తం మూడు శరీరాలతో కలిసి మెలసి ఉండాలనే ఉద్దేశంతోనే మూడుముళ్లు వేస్తారని శాస్త్రాలు తెలుపుతున్నాయి. చూశారుగా.. పెళ్లిలో వేసే మూడు ముళ్ల వెనుక ఎంతటి అర్థవంతమైన అర్థం ఉందో.

Read more:

పెళ్లిలో వధూవరులు ఏడు అడుగులే ఎందుకు వేస్తారో తెలుసా?

Advertisement

Next Story