- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమ్మాయిలు తమ వయసును ఎందుకు దాచుకుంటారో తెలుసా..
దిశ, ఫీచర్ : చిన్నప్పటి నుంచి మనం కొన్ని నానుడులను వింటూ ఉంటాం.. అందులో ఒక నానుడి ఏంటంటే అమ్మాయిల వయస్సు, అబ్బాయిల జీతం అడగొద్దు అని. ఇప్పటికే కొంతమంది దీన్ని ఫాలో అవుతూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు. అబ్బాయిలు వారి సంపాదన గురించి బహిర్గతం చేసినా అమ్మాయిలు మాత్రం వారి వయస్సును గురించిన సీక్రెట్ ను అస్సలు బయట పెట్టరు. ఒక అందమైన అమ్మాయితో ఎంతక్లోజ్ గా ఉన్నా, ఎంతసేపు మాట్లాడినా వారి వయస్సును మాత్రం అస్సలు తెలుసుకోలేరు. అసలు స్త్రీలు ఎందుకు వారి వయస్సును దాచాలనుకుంటారు.. అందులో గల ఆంతర్యం ఏమిటో ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియదు.. ఈ విషయం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు..!
మహిళలు ఎప్పుడూ అందంగా, యవ్వనంగా ఉండాలనుకుంటారు. వారి వయస్సు పెరిగినా దాన్ని దాచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. పురుషుల కంటే మహిళలే ఎక్కువగా వారి వయస్సును దాచుకునే ప్రయత్నం చేస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆడపిల్లల వయసు పెరుగుతున్నా కొద్ది వారిలో భయం పెరిగుతుందట. ముఖ్యంగా పెళ్లిళ్లు కాని యువతుల వయస్సు బయటకు తెలిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని వయసును దాచుకుంటారట. వయస్సు ఎక్కువగా కనిపిస్తే ఎక్కడ అబ్బాయిలు వారిని పట్టించుకోరో అని భయపడతారు. వయస్సు తక్కువగా కనిపిస్తే యువకులు వారిని ఇష్టపడతారని మహిళలు అనుకుంటారు. అంతే కాదు మహిళల వయస్సు ఎక్కువగా కనిపిస్తే పెద్దవారిలా ట్రీట్ చేస్తారో అని భయపడతారు.