- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మగవారికి పుట్టు మచ్చలు ఎక్కడుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : చాలా మంది పుట్టుమచ్చలు వాటి ఫలితాలు తెలుసుకోవడంపై ఆసక్తి చూపుతారు. కొందరు వీటిని నమ్మితే, మరికొందరు కొట్టిపారేస్తారు. కాగా, పుట్టుమచ్చల శాస్త్రం ద్వరా మనకు శరీర భాగాలపై ఉండే పుట్టుమచ్చల ఆధారంగా, వారి జీవితం ఎలా ఉండబోతుంది. ఏ స్థానంలో పుట్టుమచ్చ ఉంటే, మంచి జరుగుతుంది, ఏ స్థానంలో పుట్టు మచ్చ ఉంటే అశుభ ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక ఈ పుట్టుమచ్చల శాస్త్రంలో కూడా స్త్రీలకు, పురుషులకు వేరు వేరుగా ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు మగవారికి ఎక్కడ పుట్టుమచ్చలు ఉంటే మంచి జరుగుతుందో తెలుసుకుందాం.
పురుషులకు తలపైన పుట్టు మచ్చ ఉంటే వారికి కొద్దిగా గర్వం ఎక్కువగా ఉంటుంది. ప్రతి దానిని నిశితంగా పరిశీలిస్తారు. వీరికి మంచి ప్రతిభ ఉంటుంది.
రెండు చెవుల మీద ఎక్కడ పుట్టుమచ్చ ఉన్నా కూడా ధనవంతులు అవడంతోపాటు సమాజంలో మంచి పేరు కలిగి ఉంటారు.
ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్న పురుషులకు క్రమశిక్షణ ఉండదు.
భుజం మీద పుట్టుమచ్చ ఉన్న వారు కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు.
మెడ మీద పుట్టుమచ్చ కలిగిన పురుషులకు భార్య ద్వారా ధనలాభం కలుగుతుంది.
పొట్ట మీద పుట్టు మచ్చ ఉన్న వారు ఎక్కువగా భోజనం చేస్తారు.
ఎడమ కనుబొమ్మ మీద పుట్టుమచ్చ ఉంటే అలాంటి వారు కష్టపడే తత్వం కలిగి ఉంటారు.
పిక్కలపై పుట్టుమచ్చ ఉంటే పనిలో ఆలసత్వం కలిగి ఉంటారు