10 వేల రూపాయల నోట్లను ముద్రించిన RBI.. రూ.2 వేల నోట్ ఫైనల్ కాదా..?

by Sumithra |   ( Updated:2023-03-10 13:56:01.0  )
10 వేల రూపాయల నోట్లను ముద్రించిన RBI.. రూ.2 వేల నోట్ ఫైనల్ కాదా..?
X

దిశ, వెబ్‌డెస్క్ : మనం చిన్నప్పటి నుంచి ఐదు పైసల కాయిన్ నుంచి పది రూపాయల కాయిన్ వరకు చూసే ఉంటాం. ఇక నోట్ల విషయానికోస్తే రూపాయి నోటు నుంచి రెండువేల రూపాయల నోటు వరకు చూశాం కదా. మరి ఎప్పుడైనా అంత కన్నా ఎక్కువ విలువచేసే పెద్ద నోటును చూశారా. అంతకన్నా పెద్దనోటు అంటే అదే పదివేల రూపాయల నోటు ఎప్పుడైనా చూశారా..! ఏంటి పదివేల రూపాయల నోటా.. నిజమా అనుకుంటున్నారు కదా. కానీ అది నిజం. కొన్నేండ్ల క్రితం పదివేల నోటుని రిజర్వ్ బ్యాంక్ ముద్రించిందట. రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్ ఇండియా ఒకానొక సమయంలో ఈ నోటుని ముద్రించి మళ్లీ ఆపేసిందట. అయినా రిజర్వ్ బ్యాంక్ ఎందుకు ఆ నోటును ముద్రించింది.. ఎందుకు రద్దు చేసింది.. ఆ నోటు ఎప్పుడు ముద్రించారు ఇప్పుడు తెలుసుకుందాం.

భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా1938 సంవత్సరంలో ₹ 10,000 నోటును ముద్రించింది. ముద్రించిన ఎనిమిది సంవత్సరాలకే అంటే 1946 జనవరిలో డీమోనిటైజ్ చేశారు. మళ్లీ ఎనిమిది సంవత్సరాలకు అంటే 1954 సంవత్సరంలో ₹ 10,000 నోట్లను ముద్రించడం ప్రారంభించింది. 24 ఏళ్లపాటు చలామణిలో ఉన్న పదివేల రూపాయల నోట్లని చివరగా 1978లో రద్దు చేశారు. ఈ నోట్లు ముద్రించిన తరువాత చిల్లర సమస్యలు, ఇతర ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయని తెలిసి ప్రభుత్వం డీమోనిటైజ్ చేసి ముద్రణను నిలిపివేసేందుకు నిర్ణయం తీసుకుందట.

చాలామంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవలం రెండువేల రూపాయల నోటు వరకు మాత్రమే ముద్రిస్తుందని అనుకుంటారు. కానీ 1934, సెక్షన్ 24 ప్రకారం కేవలం రూ. 2, 5, 10, 20, 50, 100, 200, 500, 2000, 10,000 నోట్లను ముద్రించవచ్చు. అయితే ముద్రించే హక్కు ఉంది కదా అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విచ్చలవిడిగా నోట్లను ముద్రించదు. ముందు దేశ పరిస్థితులను అంచనా వేస్తుంది. ఆ తరువాత ఎంత కరెన్సీని ముద్రించాలని తెలుసుకుంటుంది.

ఆ తరువాత ప్రభుత్వ అనుమతితో నిబంధనలను అనుసరిస్తూ కరెన్సీని ముద్రిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా తుదినిర్ణయం తీసుకోవడానికి ముందు ఆర్‌బీఐతో చర్చిస్తుంది. ఆర్థికలోటు, వృద్ధిరేటు, జీడీపీ ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం, ఆర్బీఐ ఎంత కరెన్సీ ముద్రించాలో నిర్ణయించుకుంటారు. ఎంత పెద్ద బ్యాంక్ అయినా నోట్లు ముద్రించే విషయంలో తుది నిర్ణయం తీసుకునేది మాత్రం కేంద్ర ప్రభుత్వమే. ఇక కరెన్సీని ఎక్కువగా ముద్రిస్తే ఆర్థికవ్యవస్థ దెబ్బతింటుంది. ద్రవ్యోల్బణం రేటు గణనీయంగా పెరుగుతుంది. ఆర్థికవ్యవస్థ దెబ్బతిని కరెన్సీ విలువ పూర్తిగా పడిపోతుంది. అందుకే 1956 సంవత్సరం నుంచి 'కనీస రిజర్వ్ సిస్టమ్' కింద రిజర్వ్ బ్యాంక్ కరెన్సీని ముద్రిస్తుంది.

Read more:

గర్భం దాల్చేందుకు.. ఏ టైమ్‌లో శృంగారం చేయాలి?

Advertisement

Next Story

Most Viewed