Aghori : అఘోరాలు చనిపోతే ఏం చేస్తారో తెలుసా?.. ఎవరికీ తెలియని కొన్ని షాకింగ్ నిజాలు

by Prasanna |
Aghori : అఘోరాలు చనిపోతే ఏం చేస్తారో తెలుసా?.. ఎవరికీ తెలియని కొన్ని షాకింగ్ నిజాలు
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచంలో అతిపెద్ద పండుగలలో కుంభమేళా ( kumbhamela ) కూడా ఒకటి. ఈ ఆధ్యాత్మిక వేడుకలో కోట్లాది మంది పాల్గొంటారు. ప్రజలు, సాధువులు, పండితులు అందరూ పాల్గొనే ఈ కుంభమేళా 12 ఏళ్ల కొకసారి వస్తుంది. దాదాపు ఒక నెలకు పైగా జరిగే ఈ ఉత్సవాల్లో కొన్ని కోట్ల మంది పుణ్య స్నానాలు చేస్తారు. అయితే, ఈ కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా అఘోరాలు కనిపిస్తారు.

సనాతన ధర్మంలో అఖారా సిద్ధాంతాలను అనేక మంది అనుసరిస్తారు. వారిలో ఈ అఘోరాలు కూడా ఒకరు. అఖారాలను విస్తృతంగా శైవ(శివుని అనుచరులు), వైష్ణవ (విష్ణువు భక్తులు), ఉదాసీన్ గా విభజించారు. ఇక్కడ ప్రతి వర్గానికి వారి స్వంత నియమాలు, ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. ఈ అఖారాలలో కుంభమేళా సమయంలో వివిధ ఆచారాలు, ఊరేగింపులు జరుగుతాయి. ఇవి ఆకర్షణీయంగా నిలుస్తాయి.

అయితే మనిషి జీవితానికి, అఘోరాల ( Aghori ) జీవితానికి చాలా తేడా ఉంది. వారి జీవనశైలి ఇలాగే ఉంటుందని చెప్పడానికి ఇంత వరకు సరైన సమాచారం ఎక్కడా దొరకలేదు .. అది కనుక్కోవడం చాలా కష్టం. అయితే, ఈ అఘోరాల గురించిన షాకింగ్ నిజాల సమాచారాన్ని ఇక్కడ తెలుసుకుందాం..

ఈ రోజుకి కూడా వీరి కొన్ని సందేహాలు ఉన్నాయి. వీరంతా స్మశాన వాటికలు, గుహలలో నివసిస్తారని చెబుతారు. భోజనం లేకుండా నిత్యం ధ్యానం చేస్తుంటారని చెబుతుంటారు. అఘోరాలు శైవ సంప్రదాయానికి చెందిన ఒక భాగం మాత్రమే. వీరు ఎప్పుడూ పరమ శివుణ్ణి ఆరాధిస్తుంటారు. వారి మూలాలు 17వ శతాబ్దానికి చెందిన గొప్ప సన్యాసి అయిన కినారం వరకు ఉన్నాయి. కినారంను అఘోరాలు భగవంతుని స్వరూపంగా భావించి పూజిస్తారు.

మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. ఈ అఘోరీలు స్మశాన వాటికల్లో నిద్రిస్తూ, అక్కడ దొరికిన మాంసాన్ని తింటూ, మద్యం సేవిస్తూ, మనుషుల పుర్రెలను ప్లేట్లుగా వాడుకుంటారు. దహన బూడిదను ఒంటికి పూసుకోవడం కూడా వారి ఆచారాలలో ఒకటి. అలాగే, ఇంటి బాధ్యతలన్నిటి నుండి పూర్తిగా విముక్తి పొందుతారు. వారికీ కుటుంబం కూడా ఉండదు. వారు చనిపోయినప్పుడు దహన సంస్కారాలు ఏవి నిర్వహించరు. కేవలం నదిలో పడేస్తారు అంతే.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Next Story

Most Viewed