ఆ పార్ట్ వంకరగా ఉన్నవారిని పెళ్లి చేసుకుంటే అదృష్టమే అదృష్టం

by sudharani |   ( Updated:2023-06-07 14:44:42.0  )
ఆ పార్ట్ వంకరగా ఉన్నవారిని పెళ్లి చేసుకుంటే అదృష్టమే అదృష్టం
X

దిశ, వెబ్‌డెస్క్: మనిషికి ఉన్న చేతి వేళ్లల్లో ఒక్కొక్కటి ఒక్కో షేప్‌లో ఉంటుంది. అయితే మనిషి వేళ్లను బట్టి కూడా జ్యోతిష్య నిపుణులు ఆ వ్యక్తి ఎలాంటి వారో చెబుతున్నారు. ఈ క్రమంలోనే బొటన వేలు షేప్‌ను బట్టి ఆ వ్యక్తి ఎలా ఉంటారు.. వారికి పెళ్లి అయితే ఎలా ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతి ఒక్కరి వేళ్లు ఆకారం, పరిమాణం ఒకేలా ఉండవు. భిన్నంగా ఉంటాయి. అదే విధంగా బొటన వేలు కూడా మూడు రకాలుగా ఉంటుందట. మరి ఆ వేలు ఆకారాన్ని బట్టి జ్యోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..


* బొటన వేలు కాస్త వంకరగా ఉంటే వీళ్లు ఎవర్ గ్రీన్‌గా ఉంటారు. ఎవరైనా లైఫ్‌లో సంతోషంగా ఉండాలనుకుంటే వీరితో స్నేహం చేసిన, లేక పెళ్లి చేసుకున్న బెటర్‌గా ఉంటుంది అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. అంతే కాకుండా వీరిలో ఉండే మరొక ప్రత్యేకం ఏంటంటే.. ఏదైనా సమస్యలను పరిష్కరించడంలో అలాగే కొత్తదారులు వెతకడంలో వీరికి ఎవరు సాటిరారట. అలాంటి ప్రత్యేక నైపుణ్యం వీరు కలిగి ఉంటారట. అంతే కాదు.. వీరికి ఈగో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.



* నిటారుగా లేక, పొడవుగా ఉండే బొటన వేలు ఉన్న వ్యక్తులు సమాజంలో ఎక్కువగా పేరు ప్రతిష్టలు కోరుకుంటారు. అంతే కాదు వీరు ప్రొఫెషనల్‌గా ఎంతో క్రమశిక్షణగా ఉంటారు. విజయాన్ని అందుకోవడంలో అంకితభావంతో కృషి చేస్తారు. ఇలాంటి వ్యక్తులు ఎప్పుడు తమ ఎదుగుదల, పేరు, ప్రఖ్యాతలు తప్ప వేరే వాళ్ల గురించి ఎక్కువగా ఆలోచించరు.



* బొటన వేలు ఎక్కువగా వంగి ఉన్న వ్యక్తులు చాలా కాన్ఫిడెన్స్‌గా ఉంటారు. వీరికి గర్వం కానీ, ఇగో కానీ ఉండవు. లైఫ్‌లో ఎటువంటి సమస్య ఎదురైనా వీరు ఎదుర్కోగలరు. వీరికి సిక్త్‌సెన్స్ ఎక్కువ. వీరు కూడా జీవితంలో పేరు ప్రతిష్టలతో పాటు ఎక్కువగా గుర్తింపును కోరుకుంటారు. ఇతరులకు చేసిన సహాయాన్ని నలుగురికి చెప్పుకోవాలని చూడరు. చాలా గోప్యంగా ఉంచుతారు. అంతే కాకుండా పెళ్లి చేసుకునేందుకు వీరు పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీరు ప్రేమించారంటే ప్రాణం అయినా పెడతారు.

Also Read..

ఈ వంటింటి చిట్కాలతో నోటిపూతను తగ్గించుకోండి!

18 ఏళ్ల అబ్బాయిలు, అమ్మాయిలు చేయకూడని తప్పులు ఇవే..!

Advertisement

Next Story