యాపిల్స్ లో రకాలెన్నో తెలుసా.. ఏ రకం ఉత్తమం..

by Sumithra |   ( Updated:2024-09-17 16:18:12.0  )
యాపిల్స్ లో రకాలెన్నో తెలుసా.. ఏ రకం ఉత్తమం..
X

దిశ, వెబ్ డెస్క్ : ఎవరైనా అనారోగ్యం పాలైతే చాలు చూడడానికి వచ్చిన వాళ్లు యాపిల్ పల్లని తీసుకువస్తుంటారు. అయితే ఈ యాపిల్ పంట ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లాలో పండుతాయి. ఈ యాపిల్లలో చాలా రకాలు ఉన్నాయి. మరి అందులో ఏది బెస్ట్, ఎలాంటి వాతావరణంలో యాపిల్స్ ఉత్పత్తి అవుతాయి ఇతర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఏ రకం యాపిల్‌ను ఏ ఎత్తులో పండిస్తారు..

యాపిల్‌లో చాలా రకాలు ఉన్నాయని యాపిల్ రైతులు చెబుతున్నారు. కొత్త రకాలు మార్కెట్లలో నిరంతరం కనిపిస్తుంటాయని చెబుతున్నారు. వీటిలో గాలా, రెడ్‌వైన్, గ్రానీ స్మిత్ మొదలైన రకాలు ఉంటాయని చెబుతున్నారు. ఇది తక్కువ ఎత్తులో (4 నుంచి ఐదున్నర వేల అడుగులు) పెరుగుతుంది. అలాగే మరికొన్ని రకాలు స్పర్, రెడ్ గోల్డెన్, గోల్డెన్, రెడ్ రాయల్ మధ్య ఎత్తులో ( 5న్నర నుంచి 8 వేల అడుగుల వరకు) పెరుగుతాయి. కాగా, రాయల్ యాపిల్, దీన్ని రెడ్ డెలిషియస్ యాపిల్ అని కూడా పిలుస్తారు. ఇది ఎత్తులో (8 వేల అడుగుల పైన) పెరుగుతుంది. ఇందులో రాయల్ యాపిల్ ను బెస్ట్ యాపిల్ అంటారు.

రాయల్, రెడ్ డెలిషియస్ యాపిల్ ఎందుకు ఉత్తమమైనది ?

దీనికి చాలా కారణాలు ఉన్నాయి. రాయల్ యాపిల్ చాలా ఎక్కువ జీవితకాలం కలిగి ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా మంచిదంటున్నారు నిపుణులు. రాయల్ యాపిల్ ను 6 నెలల పాటు కోల్డ్ స్టోర్‌లో నిల్వ చేయవచ్చు. ఆ తర్వాత కూడా యాపిల్ తాజాగా ఉంటుంది. అయితే స్పర్ లేదా ఇతర రకాలు ఒక వారంలోనే పాడైపోతాయి.


Read More...

ఈ కాయను తింటే పిల్లల దగ్గు తగ్గుతుందా.. ప్రయోజనాలు, అప్రయోజనాలు ఏంటో చూద్దామా..

Advertisement

Next Story

Most Viewed