ఈ ప్రపంచంలో లైబ్రరీ నుండి ఎక్కువగా చోరీకి గురైన బుక్‌ ఏదో తెలుసా..? ఏకంగా ‘గిన్నీస్’ రికార్డ్

by sudharani |
ఈ ప్రపంచంలో లైబ్రరీ నుండి ఎక్కువగా చోరీకి గురైన బుక్‌ ఏదో తెలుసా..? ఏకంగా ‘గిన్నీస్’ రికార్డ్
X

దిశ, వెబ్‌డెస్క్: దొంగతనాలు జరగడం చాలా కామన్. అయితే.. నగలు, డబ్బు, విలువైన వస్తువులు మాత్రమే అపహరణకు గురవుతాయని తెలుసు. కానీ, పుస్తకాలు కూడా దొంగతనం చేస్తారా అంటే అవుననే చెప్పాలి. చాలా మందికి లైబ్రరీకి వెళ్లే అలవాటు ఉంటుంది. అక్కడ తమకు నచ్చిన పుస్తకాన్ని చాలా తెలివిగా వాళ్లతో తెచ్చేసుకుంటారు. అలా చాలా పుస్తకాలు లైబ్రరీ నుంచి అపహరణకు గురవుతుంటాయి.

అయితే.. లైబ్రరీ నుంచి ఎక్కువగా దొంగిలించబడిన బుక్ ఒకటి ఉంది. అది ఎక్కువగా దొంగతనానికి గురైన బుక్‌గా గిన్నీస్ రికార్డ్ కూడా ఎక్కింది. ఇంతకి ఆ బుక్ ఏంటి అనుకుంటున్నారా ‘గిన్నీస్ బుక్’. వినడానికి హాస్యాస్పదంగా ఉన్నా ఇది నిజం. గిన్నీస్ బుక్ లైబ్రరీ నుంచి ఎక్కువగా దొంగిలించబడిన బుక్‌గా గిన్నీస్ రికార్డు కూడా సాధించింది.

Advertisement

Next Story

Most Viewed