మీరు కొనేది నిజమైన బంగారమో కాదో ఇలా తెలుసుకోండి!

by samatah |   ( Updated:2023-02-07 11:13:44.0  )
మీరు కొనేది నిజమైన బంగారమో కాదో ఇలా తెలుసుకోండి!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏ శుభకార్యంలోనైనా సరే ఎవరైన ముఖ్యం చూసేది బంగారం. చాలా మందికి బంగారం ఇష్టం ఉంటుంది. ఇక అందులో మహిళల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే కొంత మంది బంగారం కొనుగోలు చేసే క్రమంలో మోసపోతుంటారు. నిజమైన బంగారం అనుకొని నకిలీ బంగారాన్ని కొంటారు. అలాంటి వారి కోసమే ఈ వార్త ఈ జీగా బంగారం నిజమైనదా లేదా నకిలీదా అని తెలుసుకోవడం ఎలానో చూద్దాం.

హాల్ మార్క్ : బంగారం నగలపై హాల్ మార్క్ అనేది తప్పని సరిగా ఉంటుంది.బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్ ధృవీకరణ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ జారీ చేస్తుంది. దీని కారణంగా హాల్‌మార్క్ చిహ్నం నిజమైన బంగారం యొక్క గుర్తింపు. అందువలన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు హాల్ మార్క్‌ను చెక్ చేయడం అనేది అస్సలే మర్చిపోకూడదు.

వెనిగర్ : వెనిగర్ సహాయంతో కూడా నకిలీ బంగారం, నిజమైన బంగారాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు. మనం కొనుగోలు చేసే బంగారంపై కొన్ని చుక్కల వెనిగర్ వేయాలి, అప్పుడు బంగారం రంగు మారితే అది నకిలీ బంగారం అని, ఎలాంటి చేంజస్ లేకపతో అది నిజమైన బంగారం అని తెలిసిపోతుంది.

Advertisement

Next Story

Most Viewed