- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మద్యం ప్రియులు తప్పుక తెలుసుకోవాల్సిన విషయం.. విస్కీలో ఎంత వాటర్ యాడ్ చేసుకోవాలో తెలుసా? తాజా అధ్యయనం
దిశ, ఫీచర్స్: ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా తప్పక స్వీకరించే డ్రింక్స్‌లో మద్యం ముందు వరుసలో ఉంటుంది. కొందరు మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు స్వీకరిస్తుండగా.. మరికొందరు రోజూ అలావాటుగా తాగుతుంటారు. మరికొందరైతే బలవంతంగా కూడా తాగేస్తుంటారు. అయితే, మద్యంలో అనేక బ్రాండులు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. మందు, బీర్లు, బ్రీజర్లు, వోడ్కా అంటూ అనేక రకాలుగా ఉంటాయి. ఇందులో కొందరు బీర్లు వ్యసనం చేసుకుంటే మరికొందరు మందును వ్యసనంగా మార్పుకున్నారు. అయితే మందును అలాగే తాగకుండా వాటర్ లేదా కూల్ డ్రింక్స్ కలుపుకొని తాగుతుండటం మనం చూస్తుంటాం. అందులోనూ ఎంతమేర వాటర్ కలుపుకోవాలో తెలియకుండా ఇష్టానుసారంగా కలుపుకొని తాగేస్తుంటారు.
అంతేకాదు.. కొందరు ఏకంగా ఐస్‌తో, మరికొందరు నీరు లేదా సోడాతో తాగుతారు. అయితే చాలా మందికి విస్కీలో ఎంత నీరు కలిపితే ప్రత్యేక రుచి ఏర్పడుతుందో తెలియదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎంత నీరు కలుపుకుంటే రుచి వస్తుందనే దానిపై ఒక పరిశోధన జరిగింది. అమెరికాలోని ఓ యూనివర్శిటీకి చెందిన ఆహార శాస్త్రవేత్తలు 2023లో ఈ అధ్యయనం చేశారు. ఈ బృందం 25 రకాల విస్కీలను అధ్యయనం చేసింది. అత్యంత అనుభవజ్ఞులైన విస్కీ టేస్టర్ల బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.
ఈ అధ్యయనంలో 80 శాతం విస్కీని 20 శాతం నీళ్లతో కలపడం వల్ల మంచి రుచి వస్తుందని వెల్లడించింది. అలాగే, విస్కీ అసలు రుచి మారదని కూడా తేల్చారు. ఈ అధ్యయనం ఇదే బెస్ట్ మిక్సింగ్ అని అంగీకరించింది. నీటిలో బాగా కలపని నాన్-హైడ్రోఫిలిక్ అణువులు తొలగించబడతాయి. ఫలితంగా సమతుల్య రుచి వస్తుంది వారు గుర్తించారు.