ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎంత సమయం నిలబడాలో తెలుసా..!

by Disha Web Desk 7 |
ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎంత సమయం నిలబడాలో తెలుసా..!
X

దిశ, ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో చాలా మంది కూర్చునే ఉద్యోగాలు ఎక్కువగా చేస్తున్నారు. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి టైప్ 2 డయాబటిక్స్, ఒబేసిటీ సమస్య, గుండె సంబంధిత సమస్యలు. ఇవన్ని ఎక్కువ సేపు కూర్చుని వర్క్ చెయ్యడం వల్ల.. బాడీలో కొవ్వు పెరిగిపోయి వస్తున్నాయి అని అధ్యయనాల్లో తేలింది. మరి మీరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే కనుక రోజులో కొంత సమయం కచ్చితంగా నిలబడాలి అంటున్నారు నిపుణులు. అయితే.. ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎంత సమయం నిలబడాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఎక్కువ సేపు కూర్చుని వర్క్ చేసే వాళ్లు కనీసం అరగంట, లేదా గంటకు ఒకసారైనా లేచి నిలబడాలట. అంతే కాకుండా ఒక ఐదు నిమిషాలు అటూ ఇటూ తిరగాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వాటితో పాటుగా రోజులో ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఉంటే మంచిదని, ఎటువంటి జబ్బులు దరి చేరవని చెబుతున్నారు. అయితే.. రోజుకు ఎంత సేపు నిలబడాలి అనే దానిపై మాత్రం సరైన స్పష్టత లేదు. ఎందుకంటే.. వారి వారి వయసును బట్టి కొందరిలో ఎక్కువ సేపు నిలబడే శక్తి ఉంటోంది. మరికొందరు నిల్చున్న కొద్ది సేపటికే కాళ్లు నొప్పులు వస్తున్నాయి అంటారు. కాబట్టి.. డైలీ వారి చేసే పనిలో ఎక్కువ సేపు అలా కూర్చుని ఉండిపోకుండా మధ్య మధ్యలో లేచి అటూ, ఇటూ తిరగడం వల్ల బ్లడ్ సర్క్యూలేషన్ బాగా జరిగి ఆరోగ్యానికి మంచిది అంటున్నారు.

Next Story

Most Viewed