- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెడ్ వైన్ తాగితే ఎన్ని ఉపయోగాలో తెలుసా..
దిశ, ఫీచర్స్ : రెడ్ వైన్ తాగడం వల్ల చర్మం మెరిసిపోతుందని చాలా సార్లు వినే ఉంటారు. రెడ్ వైన్ లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్ గుణాలు ముఖం మీద మొటిమలను దూరం చేస్తుందని చెబుతారు. అంతే కాదు ఇది ముఖంలోని ముడతలు, ఫైన్ లైన్లను తొలగించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. వైన్‌తో పోలిస్తే ఇందులో ఆల్కహాల్ తక్కువగా ఉంటుంది. రెడ్ వైన్ నిజంగా చర్మానికి మేలు చేస్తుందో లేదో వైద్య నిపుణుల ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
కొంతమంది డెర్మటాలజిస్ట్ లు రెడ్ వైన్ లో రెస్వెరాట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉందని, ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణం చర్మంలో కొల్లాజెన్‌ను సృష్టించి చర్మం మీద ముడతలను నివారిస్తుందని చెబుతున్నారు. ముఖం మీద మొటిమలు ఉంటే రెడ్ వైన్‌లో కాటన్ ను ముంచి మొటిమలు ఉన్న ప్రదేశంలో రాసి 15 - 20 నిమిషాలు అలాగే ఉంచి ఆపై కడిగితే మొటిమల సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. రెడ్ వైన్ ను లిమిట్ లో తాగితే చర్మం అందంగా ఉంటుందని చెబుతున్నారు. అధికంగా తాగడం వల్ల చర్మం దెబ్బతింటుందని బాడీ డీహైడ్రేషన్, వాపునకు గురవుతుందని పేర్కొన్నారు.