వర్షాకాలం వేడివేడి అన్నంలో పచ్చళ్లు వేసుకుని తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

by Hamsa |   ( Updated:2024-08-13 07:59:23.0  )
వర్షాకాలం వేడివేడి అన్నంలో పచ్చళ్లు వేసుకుని తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
X

దిశ, ఫీచర్స్: వర్షాకాలం వచ్చేసిందంటే.. చల్లటి వాతావరణంలో చాలా మంది వేడివేడిగా ఉంటే ఏవైనా తినేస్తుంటారు. చల్లగా ఉన్న ఆహార పదార్థాలు తినడానికి పెద్దగా ఇష్టపడరు. అయితే వానాకాలం చల్లటి వెదర్‌లో కారంగా ఉండేవి తినాలనిపిస్తుంది. సాయంత్రం వేళల్లో మిరపకాయ బజ్జీలు, పకోడీలు వేడిగా తినడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా వేడివేడి అన్నంలో ఊరగాయలు మామిడి, ఉసిరి, నాన్ వెజ్ పచ్చళ్లు, లేదా వెజ్ వంటివి వేసుకుని తింటుంటారు. ఎక్కువమందికి చల్లటి వాతావరణంలో ఏ పని కూడా చేయాలనిపించదు. ఇక వంట అయితే అసలికే చేయరు. అన్నం పెట్టుకుని కారంగా ఉండే పచ్చళ్ళు వేసుకుని లాగించేస్తుంటారు. కానీ వీటిని తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలం తినడం వల్ల వచ్చే సమస్యలతో ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. అయితేవర్షాకాలం వచ్చేసిందంటే.. చల్లటి వాతావరణంలో చాలా మంది వేడివేడిగా ఉంటే ఏవైనా తినేస్తుంటారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

*వర్షాకాలంలో ఊరగాయలు తినడం వల్ల జీర్ణ సమస్యలు రావడంతో పాటుగా కొందరికి విరేచనాలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది.

*అలాగే పచ్చళ్లు పాడవకుండా ఉప్పు, కారం, ఎక్కువగా వేస్తారు కాబట్టి ఘాటుగా తినడం వల్ల గ్యాస్, కడుపులో మంట, ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి.

* ఇక నిల్వ ఉంచిన పచ్చళ్లను పదే పదే తినడం వల్ల బీపీ కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో సోడియం కంటెంట్ పెరిగి గుండెను రిస్క్‌లో పడేస్తుంది. దీంతో పలు రకాల సమస్యలు వస్తాయి.

*మరీ ముఖ్యంగా వర్షాకాలం ఎముకలు బలహీనంగా ఉంటాయి. చల్లదనానికి ఏ పని చేయాలన్నా బద్దకంగా అనిపిస్తుంటుంది. ఇక పచ్చళ్లలో ఎక్కువగా ఉప్పు ఉండటం వల్ల శరీరంలో క్యాల్షియం గ్రహించకపోవడం వల్ల ఎముకలు మరింత బలహీనంగా మారుతాయి.

*పచ్చళ్ళు తినడం వల్ల కిడ్నీలో ఒత్తిడి పెరిగి పనితీరుపై ప్రభావం పడే చాన్స్ ఉంటుంది. అలాగే మూత్రపిండాల్లో సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి నిల్వ ఉంచిన పచ్చళ్లను వర్షాకాలం కాస్త తక్కువగా తీసుకోవడం బెటర్.

గమనిక: పైన ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా తీసుకోబడింది. దీనిని పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందించాము. దీనిని దిశ ధృవీకరించలేదు.

Read More..

Non Veg : మీరు నాన్ వెజ్ ప్రియులా.. ఈ నగరాలకు వెళ్లారంటే వెజ్ తో సరిపెట్టుకోవాల్సిందే..

Advertisement

Next Story

Most Viewed