- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీస్ వెరిఫికేషన్ తర్వాత కూడా పాస్‌పోర్ట్ రాలేదా..? వెంటనే ఇలా చేయండి..
దిశ, ఫీచర్స్ : భారతీయ పౌరులు విదేశాలకు వెళ్లాలనుకుంటే తప్పనిసరిగా వ్యాలిడ్ పాస్‌పోర్ట్ ను తీసుకుని ఉండాలి. ఇది భారతీయ పౌరసత్వానికి సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్. ప్రజలు దీనిని విదేశాలకు వెళ్ళడానికి మాత్రమే కాకుండా ఐడీ ప్రూఫ్ గా కూడా వినియోగించుకోవచ్చు. పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసే ప్రక్రియలో పోలీస్ వెరిఫికేషన్ అనేది ఒక ముఖ్యమైన దశ. పోలీసు వెరిఫికేషన్ తర్వాత కూడా పాస్‌పోర్ట్ రాకపోతే ఆందోళన చెందుతుంటారు. అలాంటి సమయంలో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాస్ పోర్ట్ అప్లై చేసుకున్న తరువాత ముందుగా పోలీస్ వెరిఫికేషన్ తర్వాతే పాస్‌పోర్ట్ జారీ చేస్తారు. పోలీస్ వెరిఫికేషన్ తర్వాత మీ పాస్‌పోర్ట్ జారీ చేయడంలో ఆలస్యం జరిగితే వేచి చూడకూడదు. ముందుగా మీరు పాస్‌పోర్ట్ సేవా కేంద్రం (PSK) లేదా ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం (RPO)ని సంప్రదించాలి. ఇక్కడ మీరు మీ పాస్‌పోర్ట్ స్టేటస్ స్థితిని తెలుసుకోవచ్చు. మీ దరఖాస్తు ఎందుకు నిలిచిపోయిందో పాస్‌పోర్ట్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు మీకు సమాచారం అందజేస్తారు.
బుక్ అపాయింట్‌మెంట్
పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని లేదా ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని (RPO) సందర్శించడానికి, మీరు ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. మొదట డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అపాయింట్‌మెంట్ తీసుకున్నట్లే, మీ పాస్‌పోర్ట్ సేవా కేంద్రం లేదా RPO వద్ద అన్ని డాక్యుమెంట్‌లను తనిఖీ చేస్తారు.
అపాయింట్‌మెంట్ కోసం పాస్‌పోర్ట్ సేవా వెబ్‌సైట్‌లో చెక్ అపాయింట్‌మెంట్ ఎంపిక పై క్లిక్ చేయండి. దీని తర్వాత మీరు మీ PSK/RPOలో అపాయింట్‌మెంట్ ను బుకింగ్ ని తనిఖీ చేసి ఏ తేదీన అపాయింట్‌మెంట్ ఖాళీగా ఉందో తెలిసిపోతుంది. అప్పుడు ఆ తేదీన స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ID, పాస్‌వర్డ్‌తో పాస్‌పోర్ట్ సేవా పోర్టల్‌కి లాగిన్ చేయడం ద్వారా ఈ అపాయింట్‌మెంట్ బుక్ అవుతుంది.